ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండదు. పాలు, కూరలు ఫ్రెష్ గా ఉండాలన్నా.. మనం తినే ఆహార పదార్ధాలు పాడైపోకుండా ఉండాలన్నా ఫ్రిడ్జ్ కచ్చితంగా ఉండాలి. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఓ నిత్యావసర వస్తువు అయిపోయింది. అయితే.. ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ ని వాడుతున్నా.. దాని గురించిన కొన్ని విషయాలు చాలా మందికి తెలియదు. ఫ్రిడ్జ్ ని ఆన్ చేసి పెట్టుకుని అందరూ వాడతారు. కానీ అది ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే.. ఫ్రిడ్జ్ ను సరైన టెంపరేచర్ దగ్గర మైంటైన్ చేయాలి.
Advertisement
Advertisement
సరైన రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత వద్ద ఫ్రిడ్జ్ లో బాక్టీరియా పెరుగుదల మందగిస్తుంది. ఆహారాన్ని చల్లగా మరియు రోజులు లేదా వారాల పాటు తినడానికి సురక్షితంగా ఉంచుతుంది. అలాగే, ఫ్రీజర్లు ఆహారాన్ని తాజాగా ఉంచుతాయి మరియు నెలల తరబడి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించగలవు. మీ ఆహారం యొక్క నాణ్యత మరియు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గించడం కోసం, మీ ఫ్రిజ్ని సిఫార్సు చేయబడిన ఉష్ణోగ్రతకు మార్చుకోవడం, రిఫ్రిజిరేటర్ నిర్వహణ మార్గదర్శకాలను అనుసరించడం అవసరం. తద్వారా ఫ్రిడ్జ్ లోని ఆహరం పాడవకుండా, పాయిజనింగ్ కి గురి కాకుండా ఉంటుంది.
ఇక చలికాలంలో బయట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ సమయంలో కూడా ఫ్రిడ్జ్ లో సరైన ఉష్ణోగ్రతని మార్చుకోవడం చాలా అవసరం. చలికాలంలో ఫ్రిడ్జ్ లోని ఉష్ణోగ్రతను 1.7 నుంచి 3.3 సెల్సియస్ వరకు ఉంచడం మంచిది. ఈ ఉష్ణోగ్రత వద్ద ఫ్రిడ్జ్ సరిగ్గా పని చేస్తుంది. అలాగే.. అందులోని ఆహార పదార్ధాలు పాడవకుండా ఉంటాయి. అలాగే కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!