Home » ఇల్లు ఒక్కటే కానీ అది ఉన్న రాష్ట్రాలు రెండు ..ఆ ఇల్లు ఎక్కడ ఉందంటే ..?

ఇల్లు ఒక్కటే కానీ అది ఉన్న రాష్ట్రాలు రెండు ..ఆ ఇల్లు ఎక్కడ ఉందంటే ..?

by AJAY
Ad

ఇల్లు ఒకటే కానీ ఆ ఇంటి లోకేషన్ మాత్రం రెండు రాష్ట్రాలు.. అంతేకాకుండా ఆ ఇంటి పన్ను కట్టే రాష్ట్రాలు కూడా రెండు… వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. అలాంటి ఇల్లు మరెక్కడోలేదు…. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోనే ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే…. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఓ ఇంట్లో నాలుగు గదులు మహారాష్ట్రలో ఉంటే మరో నాలుగు గదులు తెలంగాణలో ఉన్నాయి.

Advertisement

ఆ ఇల్లు సరిహద్దు గ్రామం మహారాజగూడలో ఉంది. 1969 తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదాన్ని పరిష్కరించినప్పుడు తమ ఇల్లు రెండు రాష్ట్రాల కిందకు వచ్చిందని ఆ ఇంటి యజమాని ఉత్తమ్ పవార్, ఆయన సోదరుడు చందు పవార్ వెల్లడించారు. ఇక అప్పటినుండి తమ ఇంటికి సంబంధించిన నాలుగు గదులు తెలంగాణలో ఉంటే… మరో నాలుగు గదులు మహారాష్ట్రలో ఉన్నాయని ఉత్తమ్ పవర్ చెబుతున్నారు.

Advertisement

అంతేకాకుండా తెలంగాణలో తన తమ్ముడికి సంబంధించిన మూడు గదులు ఉన్నాయని… తన కిచన్ మాత్రమే తెలంగాణలో ఉందని మిగతా గదులు మహారాష్ట్రలో ఉన్నాయని వెల్లడించారు. అయితే రెండు రాష్ట్రాల్లో తమ ఇల్లు ఉండటం వల్ల తమకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు రాలేదని చెప్పారు. అంతేకాకుండా తాము రెండు రాష్ట్రాలకు సంబంధించిన పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నామని అన్నారు.

ఇక వాహనాల రిజిస్ట్రేషన్ సైతం తాము రెండు రాష్ట్రాల నుండి చేయిస్తున్నట్టు తెలిపారు. తమ ఇంట్లో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా.. 8 గదులు ఉన్నాయని ఉత్తమ్ పవార్ వెల్లడించారు. ఇక రీసెంట్ గా ఓ మీడియా ఛానల్ లో ఉత్తమ్ పవార్ ఇంటికి సంబంధించిన వార్త రావడంతో ఆ విషయం కాస్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ఓకే ఇల్లు రెండు రాష్ట్రాల కిందకి రావడం ఏంటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Visitors Are Also Reading