Home » చిన్న పిల్లలు తరచుగా దగ్గుతున్నారా? అయితే ఇలా చెయ్యండి!

చిన్న పిల్లలు తరచుగా దగ్గుతున్నారా? అయితే ఇలా చెయ్యండి!

by Srilakshmi Bharathi
Ad

చలికాలంలో ఎక్కువగా చలి ఉంటుంది. అలాగే.. దట్టంగా పొగమంచు పడుతూ ఉంటుంది. దీనివలన చిన్న పిల్లలు జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే.. చిన్నపిల్లలకు దగ్గు వస్తే.. మందులు వాడడం కంటే.. ఇంటి చిట్కాలతో త్వరగా తగ్గించుకోవడం ఎంతో మేలు. చిన్నపిల్లలు దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఇంటి చిట్కాలను పాటించండి. వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే పసుపు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

Advertisement

ఈ పసుపుని గోరు వెచ్చని పాలల్లో కలిపి తాగించడం వలన రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది. అంతే కాకుండా.. పసి పిల్లలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. సీజనల్ వ్యాధులను సైతం వారు సమర్ధవంతంగా ఎదుర్కొనగలుగుతారు. ప్రతి ఒక్కరు ఇళ్లల్లో తులసి మొక్కలను పెంచుతూనే ఉంటారు. తులసి ఆకుల ద్వారా కూడా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం అందించవచ్చు. తులసి ఆకులను నలిపి నీళ్ళల్లో వేసి ఆ నీటిని తాగించడం ద్వారా ఉపశమనం పొందుతారు.

Advertisement

ఇంకా తులసి ఆకుల రసానికి కొద్దిగా తేనే కలిపి తాగిస్తే చిన్నారుల్లో వచ్చే దగ్గు క్రమేపీ తగ్గుతుంది. అలాగే వంటల్లో ఉపయోగించే వెల్లుల్లికి కూడా రోగ నిరోధక లక్షణాలను పెంపొందించే అలవాటు ఉంది. చిన్న వెల్లుల్లి రెబ్బని మెత్తగా చేసి దానిలో తేనే కలిపి తినిపించడం కూడా మంచిది. అయితే..ఈ టిప్ మాత్రం రెండు సంవత్సరాల కంటే చిన్న వారికి మాత్రమే. అలాగే మార్కెట్ లో దొరికే యూకలిఫ్టస్ ఆయిల్ కూడా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం ఇస్తుంది. ఈ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని పిల్లల దుస్తులపై రాయడం ద్వారా.. వారు ఆ వాసనను పీల్చుకుని రిలీఫ్ పొందుతారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading