తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులున్నప్పటికీ కొన్ని కాంబినేషన్స్ భలే సెట్ అవుతాయి. అలా హీరో హీరోయిన్ గా అద్భుతంగా సెట్ అయిన హిట్ పెయిర్ అనిపించుకున్న కొన్ని జంటల గురించి ఇప్పుడు చూద్దాం! వీరి కెమిస్ట్రీ , టైమింగ్ అద్భుతంగా కుదరడం వల్ల డైరెక్టర్లు ఈ పెయిర్ ను చాలా సార్లు కంటిన్యూ చేశారు.
వెంకటేష్ + మీనా:
90s స్టార్టింగ్ లో స్టార్ట్ అయిన ఈ పెయిర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చంటి, సుందరాకాండ, అబ్బాయిగారు వీరి కాంబోలో వరుసగా వచ్చాయి. 22 ఏళ్ళ తర్వాత దృశ్యంలో కలిసి నటించి మళ్లీ హిట్ కొట్టారు.
Advertisement
Advertisement
నాగార్జున, రమ్యకృష్ణ:
హలో బ్రదర్, ఘరానా బుల్లోడు సినిమాల్లో అద్భుతమైన కెమిస్ట్రీని పండించిన ఈ జోడీ అన్నమయ్య తర్వాత భారీ గ్యాప్ తీసుకుని సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమాలో కలిసి నటించారు. అన్ని సినిమాలు హిట్ యే!
రాజేంద్ర ప్రసాద్ + ఆమనీ:
ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా ఇష్టమైన జోడీ ఇది. వీరి కాంబోలో దాదాపు 4 సినిమాలు వచ్చాయి ప్రతిదీ హిట్ యే. లేటెస్ట్ గా ఆ నలుగురు సినిమా కూడా వీరి కాంబినేషన్ లో వచ్చి హిట్ కొట్టింది.