Home » పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్… !

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్… !

by Bunty
Ad

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజకీయాలను అలాగే సినిమాలను రెండు సమాన పాల్లుగా విభజించి, అందరికీ సమన్యాయం చేస్తున్నాడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతూనే, జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాల ద్వారా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. జనాలను కోసం, వారి సంతోషం కోసం వరుసగా సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్.

Advertisement

భగత్ సింగ్, హరిహర వీరమల్లు అలాగే బ్రో సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే ఇటీవల ఓజి సినిమా ను కూడా ప్రకటించేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాను సాహో దర్శకుడు సుజిత్ చాలా గ్రాండ్గా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పూర్తిగా పాన్ ఇండియా స్టార్లను దించబోతున్నాడు దర్శకుడు సుజిత్. ఈ సినిమాను డివివి దానయ్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించనుంది. అటు అర్జున్ దాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఇందులో మరో బాలీవుడ్ నటుడిని పరిచయం చేసింది చిత్రం బృందం. పవన్ కళ్యాణ్ సినిమాలో… బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హస్మిని రంగంలోకి దించింది ఓజీ బృందం. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఇమ్రాన్ హస్మి నటించబోతున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ ప్రచారం సాగింది. ఆ కీలక పాత్ర విలన్ అని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే మొత్తానికి అయితే ఇవాళ అధికారిక పోస్టర్ ద్వారా… ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రం బృందం.

ఇవి కూడా చదవండి :

అశ్విన్ లీలలు.. బయటపెట్టిన స్టార్ స్పిన్నర్ భార్య !

ఫోన్‌లో ఈ చిన్న రంధ్రం ఎందుకు పెట్టారు ? దీని ఉపయోగం ఏంటి ?

ఉపాసన జతకంపై జ్యోతిష్యుడు సంచలన వ్యాఖ్యలు… చరణ్ కు కొడుకు పుడితే జరిగేది ఇదే ?

Visitors Are Also Reading