పొగతాగడం ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్ కు కారకం ఇది ప్రతి సినిమాకు ముందు వేస్తారు. కానీ ఆ సినిమాలో నటించే హీరోలే చాలా మంది పొగతాగటం అలవాటు చేసుకున్నారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసుకుని విడిచిపెట్టారు. నిజానికి ఒకసారి స్మోకింగ్ అలవాటైతే మళ్లీ వదిలిపెట్టడం అంత ఈజీ కాదు. కానీ మన హీరోలు స్మోకింగ్ కు దూరంగా ఉంటూ అభిమానులకు ఆదర్శంగా ఉంటున్నారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మహేశ్ బాబు
ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాల్లో ఎంతో స్టైల్ గా దమ్ముకొడుతూ కనిపిస్తాడు. ఇక నిజజీవితంలోనూ అదే అలవాటు ఉండేదట. కానీ ఓ ఫ్రెండ్ ఇచ్చిన పుస్తకం చదివి స్మోకింగ్ కు గుడ్ బై చెప్పాడట.
రానా
రానాకు ఒకప్పుడు చైన్ స్మోకర్ అని పేరుంది. అయితే ఓ షోలో తనకు ఉన్న చెడు అలవాట్ల వల్ల అనారోగ్యానికి గురయ్యానని ప్రస్తుతం అన్ని అలవాట్లను మానుకోగలిగానని రానా చెప్పాడు.
Advertisement
విజయ్ దేవర కొండ
విజయ్ దేవర కొండకు కూడా ఒకప్పుడు స్మోకింగ్ అలవాటు ఉండేదట. కానీ ఆరోగ్యం పై ఉన్న శ్రద్దతో విజయ్ స్మోకింగ్ ను దూరం పెట్టాడట.
కమల్ హాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ తన తోటి హీరోయిన్లకు ఇబ్బంది కలగ కూడదని స్మోకింగ్ ను పక్కన పెట్టాడట.
రజినీకాంత్
రజినీకాంత్ కు మందు నుండి స్మోకింగ్ అలవాటు ఉంది. అయితే తనకు మనవడు పుట్టిన తరవాత అతడికోసం రజినీ స్మోకింగ్ ను పక్కన పెట్టాడు.
also read : ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 తప్పులు అస్సలు చేయకండి..!