సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ హీరోయిన్ లకు ఉండదు. ఎప్పుడు అవకాశాలు ఉంటాయో ఎప్పుడు ఫేడ్ అవుట్ అవుతారో చెప్పలేం. అయితే అలా ఫేడ్ అవుట్ అయ్యాక కొంతమంది అక్క వదిన క్యారెక్టర్ లు చేసుకుంటూ ఇండస్ట్రీలోనే కొనసాగితే మరికొందరు మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారు. అలా ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటించి అవకాశాలు తగ్గుముకం పట్టిన తరవాత గుడ్ బై చెప్పిన హీరోయిన్ షీలా కౌర్.
ALSO READ : ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు.. వారి గురించేనా?
Advertisement
అయితే పేరు చెబితే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కానీ పరుగు సినిమా హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ ముద్దుగుమ్మ అందం టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. టాలీవుడ్ లో పరుగు సినిమా మాత్రమే కాకుండా మస్కా, రాజు భాయ్, అదుర్స్ సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించింది.
Advertisement
అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు తగ్గుముకం పట్టడంతో ఆ తరవాత సీనియర్ హీరోల పక్కన నటించేందుకు కూడా రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య హీరోగా నటించిన పరమవీరచక్ర సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తరవాత మాత్రం అవకాశాలు లేకుండా పోయాయి. ఈ సినిమా 2011లో రాగా షీలా కౌర్ కు ఇదే చివరి సినిమా అయ్యింది.
ఆ తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పిన బ్యూటీ కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుంది. సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లిచేసుకోగా ప్రస్తుతం ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. ఇక ఇప్పటికే చాలా మంది గుడ్ బై చెప్పిన హీరోయిన్ లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాంతో షీలా కౌర్ కూడా రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ALSO READ :మన స్టార్ హీరో హీరోయిన్స్ అసలు పేర్లు ఇవేనని తెలుసా ? చాలామందికి తెలియని పేర్లు !