Home » విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు.. ఎంతో నరకం చూస్తున్నా ?

విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు.. ఎంతో నరకం చూస్తున్నా ?

by Bunty
Ad

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్న హీరోయిన్లలో ఒకరు సమంత. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత… ఆ తర్వాత ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఏం మాయ చేసావే సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడిపోయింది హీరోయిన్ సమంత.

Advertisement

ఈ సినిమా తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 2017 సంవత్సరంలో నాగచైతన్య మరియు సమంత పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వీళ్ళ పెళ్లి జరిగినప్పటికీ… కొన్ని చిన్న చిన్న కారణాలవల్ల ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు వేరు వేరు గానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సమంతకు ఇటీవల ఓ అనారోగ్యం వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో తాజాగా తన విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సమంత.

Advertisement

తన జీవితంలో విడాకులు, వరుస ప్లాపులు, అలాగే అనారోగ్య సమస్యలు ఒక్కసారి చుట్టుముట్టాయని ఆవేదన వ్యక్తం చేసింది సమంత. నేను విడాకుల బాధలో ఉన్న సమయంలోనే నాకు అనారోగ్యం వచ్చింది… అంతలోనే వరుసగా సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి… దీంతో మనోవేదనకు గురయ్యాను అంటూ ఎమోషనల్ అయింది సమంత. గత రెండు సంవత్సరాలుగా తాను ఎంతో బాధపడుతున్నానని… అలాగే ట్రోలింగుకు కూడా గురవుతున్నానని వెల్లడించింది. అయినప్పటికీ జీవితంలో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది సమంత.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading