ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు గా రాణించిన వారిలో హీరోయిన్ నగ్మా కూడా ఒకరు. నగ్మా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 90లలో టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి పక్కన జోడిగా నటించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లతో నగ్మ సినిమాలలో నటించి తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
Advertisement
నగ్మా హీరోయిన్ గా నటించిన అల్లరి అల్లుడు, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, భాష, ప్రేమికుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నగ్మాకు యూత్ లో చాలా ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే ఆమెను చూడటానికే సినిమా వెళ్లే అభిమానులు సైతం ఉండేవారు. సినిమాలలో ఎంతో సక్సెస్ అయిన నగ్మా వార్తల్లోనూ అప్పట్లో హాట్ టాపిక్ గా మారారు.
Advertisement
మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీతో నగ్మా ప్రియమైన నడిపించారు. కొంతకాలం వీరిద్దరూ చట్టా పట్టలేసుకుని తిరిగారు. కానీ ఆ విషయం గంగూలీ భార్యకు తెలవడంతో నగ్మా కు దూరమయ్యాడు. ఆ తర్వాత నగ్మా శరత్ కుమార్, రవికిషన్లతో సైతం ప్రేమాయణం నడిపించిందని వార్తలు వినిపించాయి. ఇక కొంతకాలానికి మెల్లమెల్లగా ఆమె సినిమాలకు దూరమయ్యారు. అంతేకాకుండా ఇప్పటికీ నగ్మా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయారు.
ఇదిలా ఉంటే హీరోయిన్ జ్యోతిక నగ్మాకు స్వయాల చెల్లి అవుతుంది. కాగా రీసెంట్ గా జ్యోతిక సూర్యతో కలిసి నగ్మా ఓ హోటల్ లో కనిపించారు. దాంతో నగ్మా కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ఒకప్పుడు అందాల తారగా రాణించిన నగ్మా ఇప్పుడు ఎంతలా మారిపోయింది అని నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు.