Home » హీరోయిన్ ఇలియానాకు తీవ్ర అస్వస్థత…ఆహారం కూడా తినలేని స్థితిలో గోవా బ్యూటీ….!

హీరోయిన్ ఇలియానాకు తీవ్ర అస్వస్థత…ఆహారం కూడా తినలేని స్థితిలో గోవా బ్యూటీ….!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా ఇలియానా సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి పోస్ట్ చేశారు. ఇలియానా తన పోస్ట్ లో….. నా ఆరోగ్యం గురించి అడుగుతూ మెసేజ్ పెడుతున్న ప్రతి ఒక్కరికీ థాంక్యూ…. మీ అభిమానానికి ప్రేమకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రస్తుతం నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. సరైన సమయానికి సరైన మందులు వేసుకున్నాను అంటూ పోస్టులో పేర్కొన్నారు.

Advertisement

దాంతో ఇలియానాకు ఏమైంది అని అభిమానులు నెటిజన్స్ ఆందోళన చెందారు. కాగా ఇలియానా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కనీసం ఆహారం తీసుకోని స్థితిలో ఇలియానా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇలియానా ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడింది అని ప్రకటించడంతో అభిమానులు నెటిజన్ లు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ఇలియానా టాలీవుడ్ లో రామ్ హీరోగా నటించిన దేవదాస్ సినిమాతో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరవాత పోకిరి సినిమా తో టాలీవుడ్ లో మ్యాజిక్ చేసింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. జులాయి సినిమాలో ఇలియానా అల్లు అర్జున్ కు జోడిగా నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇలియానా చాలా సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో సరికొత్త గ్లామర్ షోకు ఇలియానా తెరలేపింది.

స్టార్ హీరోలకు జోడిగా సినిమాలు చేసింది. అంతేకాకుండా కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్ గా ఇలియానా సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ లో ఆఫర్ లను వెతుక్కుంది. బాలీవుడ్ లోనూ మొదట్లో కొన్ని సినిమాలలో నటించింది. కానీ ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.

Also read :తారకరత్న తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల…ఇంకా విషమంగానే ఆరోగ్యం..!

Visitors Are Also Reading