ఒకప్పుడు హీరోయిన్ లుగా అభిమానులను సంపాదించుకున్న చాలా మంది హీరోయిన్ లు ప్రస్తుతం సినిమాలకు దూరం అయ్యారు. అయితే కొంతమంది సోషల్ మీడిమాలో సందడి చేస్తున్నా కూడా కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం అసలు కనిపించకుండా పోయారు. అలా తన అందం అభినయంతో ప్రేక్షకుల మదిని దోచుకుని ప్రస్తుతం కనిపించకుండా పోయిన హీరోయిన్ లలో గోపిక కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో హీరోయిన్ గా నటించి అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మకు చాలా మంది ఫిదా అయ్యారు. సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు అందమైన చిరునవ్వుతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రవితేజ గోపిక మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగనచ్చేసింది. ఇక గోపిక ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే సొంత టాలెంట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట మలయాళ చిత్రసీమలో హీరో జయసూర్య పక్కన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
Advertisement
ఆ తరవాత చాలా మలయాళ సినిమాలలో నటించింది. కానీ నా ఆటోగ్రాఫ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ కూడా పలు చిత్రాలు చేసినా సరైన హిట్స్ పడలేదు. ఆ తరవాత గోపిక సినిమాలకు దూరం అయ్యింది. అంతే కాకుండా ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని గోపిక పెళ్లి చేసుకుంది.
ఇక ప్రస్తుతం వీరిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లిన గోపిక తన ఫ్యామిలీ ఫోటోలను తన ఫోటోలనూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఇక గోపిక ను చూసిన అభిమానులు సైతం మీరు మళ్లీ సినిమాల్లోకి రావాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.