మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించగా గిరిజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో గిరిజ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాంతో గిరిజకు వరుస ఆఫర్ లు క్యూ కట్టాయి. అంతే కాకుండా అన్నీ టాప్ హీరోల సినిమాలే కావడం విశేషం. ఆమె ఓకే చెప్పాలే గానీ వరుస సినిమాలకు సైన్ చేయించుకునేందుకు దర్శకులు నిర్మాతలు లైన్ లో నిలబడ్డారు.
Advertisement
కానీ గిరజ మాత్రం తన పాత్ర మరియు కథ ఏంటని ఏ సినిమా పడితే ఆ సినిమాకు ఓకే చెప్పలేదు. మనసును హత్తుకునే పాత్రలకు మాత్రమే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. తల్లి బ్రిటిష్ తండ్రి ఇండియన్ అమెరికాలో స్థిరపడిన వీరి ఫ్యామిలీ చాలా రిచ్ అవ్వడంతో గిరిజ సినిమాను ఫ్యాషన్ కోసం మాత్రమే చేసేది కానీ సినిమాలు ఆమెకు ప్రొఫెషన్ కాదు. ఈ నేపథ్యంలోనే ఇంట్రెస్టింగ్ కథలకు మాత్రమే ఓకే చెబుతూ వెళ్లింది.
Advertisement
ఈ క్రమంలో ఆనందతాండవం అనే డిఫరెంట్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా బోల్తా కొట్టింది. ఆ తరవాత హృదయాంజలి అనే మరో డిఫరెంట్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కేవలం మూడు పాత్రలే ఉంటాయి. ఈ సినిమాలో జయలలిత కూడా నటించింది. సంజయ్ మిత్ర ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈసినిమా నాలుగు అవార్డులు దక్కించుకుంది.
ఈ సినిమా తరవాత గిరిజ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన జో జీతా వహీ సిఖిందర్ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ లో లేని వాలీబాల్ గ్లామరస్ సీన్ లో నటించాలని గిరిజకు చెప్పారు. దానికి గిరిజ నో చెప్పడంతో ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో ఆమె రిజెక్ట్ చేసి కోర్టు మెట్లు ఎక్కింది. ఇక కోర్టు కూడా గిరిజకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇక చేసేది లేక ఆమెకు నష్టపరిహారం చెల్లించి సినిమాను మరో హీరోయిన్ తో పూర్తి చేశారు.