నటులన్నాక సినిమాల్లో ఏ పాత్రలు ఇచ్చినా కూడా చేయాల్సిందే. దానికి తగ్గట్టుగా నటించి ఆకట్టుకోవడం హీరోల నైజం. అయితే చాలామంది హీరోలు ఇప్పటికే పోలీస్ పాత్రలు వహించారు. అలానే జర్నలిస్ట్ పాత్రలులో కూడా చాలామంది మెప్పించారు. జర్నలిస్ట్ పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోల వివరాలు చూద్దాం.
పవన్ కళ్యాణ్:
Advertisement
పవన్ కళ్యాణ్ బంగారం, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాల్లో జర్నలిస్టుగా కనబడి ఆకట్టుకున్నారు. అయితే సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
బాలకృష్ణ:
బాలకృష్ణ శ్రీమన్నారాయణ సినిమాలో జర్నలిస్ట్ గా కనపడి ఆకట్టుకున్నారు సినిమా మాత్రం సక్సెస్ కాలేదు.
రవితేజ:
మాస్ మహారాజ్ రవితేజ ఆంజనేయులు సినిమాలో జర్నలిస్టుగా కనపడ్డాడు కానీ సినిమా పెద్ద హిట్ అవలేదు. మిక్స్డ్ టాక్ ని మాత్రమే సొంతం చేసుకుంది.
వెంకటేష్:
తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన గణేష్ సినిమాలో జర్నలిస్టుగా నటించారు వెంకటేష్. సినిమా మంచి హిట్ అందుకుంది.
నాని:
శ్యాం సింగరాయ సినిమాలో జర్నలిస్టుగా కనపడ్డాడు నాని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని పొందింది.
Advertisement
నిఖిల్:
అర్జున్ సురవరం సినిమాలో జర్నలిస్టుగా నటించాడు ఈ సినిమా బానే ఆడింది.
కళ్యాణ్ రామ్:
ఇజం సినిమాలో కళ్యాణ్రామ్ జర్నలిస్ట్ గా నటించాడు. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.
జీవా:
జీవా రంగం సినిమాలో జర్నలిస్టుగా కనపడ్డాడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
చిరంజీవి:
అందరివాడు సినిమాలో సిద్ధార్థ అనే జర్నలిస్టుగా చిరు కనపడ్డారు సినిమా యావరేజ్ గానే నిలిచింది.
నాగశౌర్య:
ఊహలు గుసగుసలాడే సినిమాలో వెంకీ అనే జర్నలిస్టుగా నాగశౌర్య కనిపించాడు.
నాగచైతన్య:
దూత వెబ్ సిరీస్ లో జర్నలిస్టుగా నాగచైతన్య నటించాడు. విక్రమ్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. అలానె ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ షార్జా నటించాడు. శ్రీహరి పరశురాం సినిమాలో జర్నలిస్టుగా కనపడ్డారు. అలానే తారకరత్న తారక్ సినిమాలో జర్నలిస్టుగా నటించాడు. నవదీప్ న్యూసెన్స్ వెబ్ సిరీస్ లో జర్నలిస్టుగా నటించాడు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!