ఈసారి సంక్రాంతికి ఇద్దరు హీరోల మధ్య పెద్ద పోరు జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న థియేటర్లోకి రానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలోనే వైజాగ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను,ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారని చెప్పవచ్చు. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ పాత్ర కూడా చాలా కీలకంగా ఉందట.
Advertisement
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ గురించి రవితేజ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మెగాస్టార్ నటించిన విజేత మూవీ విజయోత్సవాన్ని వేలాదిమంది అభిమానుల మధ్య తాను ఒక్కడిగా చూసానని తెలియజేశారు. ఆ టైంలో చిరు పక్కన కూర్చోవాలని అనుకున్నారని, వారి స్నేహితులతో చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి పక్కన కూర్చోవడం కాదు ఏకంగా ఆయనతో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు.
Advertisement
ఈ సినిమా వేడుకతోనే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయని ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరూ పోటీకి వచ్చిన విజయం అన్నయ్యదే అని బలంగా చెప్పారు హీరో రవితేజ. వ్యక్తిగతంగా అన్నయ్య చాలా మంచి మనస్తత్వం కలవాడు. ఎంతమంది ఆయనను ఎన్ని మాటలు అన్న వాటిని భరిస్తూ మనసులోనే బాధపడతాడు తప్ప బయటకు వ్యక్తపరచరు అంటూ రవితేజ అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
also read:బాలకృష్ణ, రవితేజ మధ్య ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?