Yawning : కేవలం మనిషికే కాదు ప్రతి జీవికి కూడా తుమ్ములు, ఆవలింతలు రావడం అనేది సర్వసాధారణం. అంతేకాకుండా ఎదుటివారు ఆవలింత ( yawning) తీస్తుంటే ఆటోమేటిక్గా మనకు కూడా ఆవలింతలు రావడం చాలాసార్లు గమనించి ఉంటాం. కానీ దీని వెనక ఉన్న లాజిక్ మాత్రం ఏ సైంటిస్టులు కూడా ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. ఇంకా ఇప్పటివరకు కూడా దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం శరీరం అలసటకు లోనైనప్పుడు ఆవలింతలు వస్తాయట.
Advertisement
ఆవలింతలు అంటువ్యాధికి చెందిన రకం కాకపోయినా, ప్రతిస్పందన చర్యకు సంబంధించిన ఆరోగ్యకరమైన చర్యగా చెబుతారు. వాస్తవానికి మనిషి శరీరం పూర్తిగా అలసటకు లోనైనప్పుడు నువ్వు నిద్ర పోవాలని సూచనగా ఆవలింతలు వాతంట అవే వస్తాయట. కానీ అదే పనిగా ఆవలింతలు రావడానికి ఒక కీలక పరిమాణంగా గుర్తించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు కూడా ఆవలింతలు వస్తే అది తీవ్ర అనారోగ్యానికి సంకేతం అని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
మనలో చాలామంది ఎక్కువగా ఆవలింతలు రావడాని చాలా తేలిగ్గా పరిగణిస్తారు. తరచూ ఆవలింతలు వస్తే గుండె సంబంధిత అనారోగ్యానికి గురవుతారని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఆవలింత వస్తూ ఉంటే కచ్చితంగా మన ఆరోగ్యంపై అప్రమత్తం అవ్వవలసిన పరిస్థితి ఉంది. ఎక్కువగా ఆవలింతలు రావడం అనేది మెదడుకు సరిగ్గా ఆక్సిజన్ అందడంలేదని సూచన. మెదడుకు సరిగ్గా ఆక్సిజన్ అందనప్పుడు, రక్తప్రసరణలో అవకతవకలు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేపనిగా ఆవలింతలు వస్తూ ఉంటే శరీరానికి శ్వాస సరిగా అందటం లేదని అర్థమని తెలియజేస్తున్నారు. మీరు గనుక ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లయితే.. వెంటనే డాక్టర్లును సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఏ పాలు తాగడం వల్ల పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుందో తెలుసా..?
Health Tips: అన్నం తిన్న తరువాత ఈ పొరపాట్లను అస్సలు చెయ్యకండి.. ఎందుకంటే?