పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే, అనారోగ్య సమస్యలు వస్తాయని చాలామందికి తెలియదు. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్య, కుటుంబం మధ్య సమస్యలు అనారోగ్య సమస్యలకి గురిచేస్తుంది. కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉంటే మానసిక ఇబ్బందులు వస్తాయి ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది దాంతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇంట్లో గొడవలు అస్తమాను జరుగుతున్నట్లయితే రక్తపోటు బాగా పెరుగుతుంది.
Advertisement
Advertisement
మహిళల్లో కంటే పురుషుల్లోనే హై బీపీ ఉంటుందట. తరచూ గొడవలు అవుతున్నట్లయితే మానసిక ఇబ్బందులు వస్తాయి. ఉత్సాహాన్ని కోల్పోతారు. డిప్రెషన్ వంటి ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాగా ఎక్కువగా గొడవలు జరుగుతుంటే ఆయుషు కూడా బాగా తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య ఇళ్లలో గొడవలు అయినట్లయితే రిలేషన్షిప్ దెబ్బ తినడమే కాదు అధిక బరువు సమస్యను కూడా ఎదుర్కోవాలి. అలానే గుండె జబ్బులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందట. కాబట్టి మీ రిలేషన్షిప్ ని అందంగా మార్చుకోండి లేదంటే అనవసరంగా ఇటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
Also read:
- పచ్చ కర్పూరం తో ఈ సమస్యలకి చెక్ పెట్టేయండి…!
- బియ్యం కడిగిన నీళ్లతో.. ఇలా మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి…!
- మానసిక ప్రశాంతత ని పొందాలని చూస్తున్నారా..? అయితే ఇవి తప్పక పాటించండి..!