Home » సర్జరీ కోసం ఇల్లు అమ్మేసిన జబర్దస్త్ శాంతి స్వరూప్…!

సర్జరీ కోసం ఇల్లు అమ్మేసిన జబర్దస్త్ శాంతి స్వరూప్…!

by Bunty
Ad

 

జబర్దస్త్ గురించి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది మంచి జీవితాలను పొందారు. చాలామంది ఈ షోలో అవకాశాలను అందిపుచ్చుకొని చాలా పాపులర్ అయ్యారు. అలా పాపులర్ పాపులర్ అయ్యి సినిమాలలో నటిస్తున్నవారు కూడా ఉన్నారు. ఇక జబర్దస్త్ లో భారీ పాపులారిటీ సంపాదించిన వారిలో శాంతి స్వరూప్ కూడా ఒకరు. ఇతను లేడీ గెటప్ లలో చాలా అద్భుతంగా నటిస్తాడు. ఇతని నటనకు చాలామంది అభిమానులు ఉన్నారు.

Advertisement

Advertisement

ఇతను సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని కూడా నడిపిస్తున్నాడు. శాంతి స్వరూప్ పైకి చాలా నవ్వుతూ, అందరిని నవ్విస్తూ ఉంటాడు. కానీ అలా తన నవ్వు వెనక పెద్ద విషాదం ఉందట. తాను ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇంటిని శాంతి స్వరూప్ అమ్మేస్తున్నానని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. జబర్దస్త్ లో బాగా సంపాదిస్తున్న శాంతి స్వరూప్ ఇల్లు అమ్మడం ఏంటని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇందులో భాగంగానే తాను ఇల్లు అమ్మడానికి గల కారణాలని చెప్పుకొచ్చాడు. తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, తనకు సర్జరీ చేయించాలంటే డబ్బు కావాలని తన వద్ద ఉన్న డబ్బు దానికి సరిపోదని… అందువల్లనే ఇంటిని అమ్మేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

మా అమ్మ కంటే నాకేమీ ముఖ్యం కాదు, మా అమ్మ ఆరోగ్యంగా ఉంటే నేను ఎంతైనా సంపాదించుకోగలుగుతాను అని శాంతి స్వరూప్ వీడియోలో చెప్పుకొచ్చాడు. మా అమ్మకి ఇల్లు అమ్మేస్తున్నానని తెలిస్తే అసలు ఒప్పుకోరు. కానీ మా అమ్మకి తెలియకుండా చేస్తున్నానని బాధపడ్డాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు అమ్మ త్వరగా కోలుకుంటుంది. మీ అమ్మ కోసం మీరు చేస్తున్న పని చాలా గొప్పది. మీరేమీ బాధపడకండని కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading