బిర్యానీ చేసుకోవడానికి కచ్చితంగా మనం బిర్యాని ఆకులని వాడుతూ ఉంటాము. అలానే కొన్ని కొన్ని కూరల్లో కూడా మనం బిర్యానీ ఆకులని వాడుతుంటాము. బిర్యానీ ఆకుల వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. పైగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ బిర్యానీ ఆకుల వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు అనే విషయానికి వచ్చేస్తే.. అజీర్తి సమస్యలను దూరం చేసుకోవడానికి ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. వికారం, అజీర్తి సమస్యల్ని తొలగించుకోవచ్చు.
Advertisement
Advertisement
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటాయి. స్టడీ ప్రకారం యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు కూడా వీటిలో ఉంటాయట. ఇంఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. బిర్యానీ ఆకులని టీ చేసుకుని మనం తీసుకోవచ్చు. పౌడర్ కింద చేసుకుని మనం అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. లేదంటే నేరుగా బిర్యానీ ఆకుల్ని మనం వంటల్లో వేసుకుని తీసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్న ఇటువంటి ప్రయోజనాలను పొందవచ్చు కనుక అప్పుడప్పుడు బిర్యాని ఆకుల్ని తీసుకోవడం మంచిది.
Also read:
- డ్రై ఫ్రూప్ట్స్ ని… ఇలా అస్సలు తీసుకోవద్దు.. ఆరోగ్యం పాడవుతుంది..!
- పేలు బాధ భరించలేకపోతున్నారా..? ఇలా సులభంగా వదిలించచ్చు…!
- చాణక్య నీతి: కష్టాల్లో ఈ 4 విషయాలు.. అస్సలు మరిచిపోవద్దు..!