Home » రెండవ ప్రపంచ యుద్ద సమయంలో పెళ్లి పత్రికను ఎప్పుడైనా చూశారా

రెండవ ప్రపంచ యుద్ద సమయంలో పెళ్లి పత్రికను ఎప్పుడైనా చూశారా

by aravind poju
Ad

ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇల్లు నిండా బంధువులతో చాలా సందడిగా ఉండేది. కానీ రాను రాను ఉరుకుల పరుగుల జీవితాలలో పడి పెళ్లికి పది రోజుల ముందు వచ్చే బంధువులు పది నిమిషాల ముందు హాజరవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పెళ్లి అంటే లక్షలతో కూడుకున్న వ్యవహారం. పెళ్లి కార్డు నుండి మొదలుకొని ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు జరిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏ పెళ్లికైనా ముఖ్యంగా అందరినీ పెళ్లికి ఆహ్వానించాలంటే మొదట కావలసింది పెళ్లి కార్డు. అయితే ఇప్పుడు డిజిటల్ హవా నడుస్తోంది కాబట్టి రోజుకో వెరైటీ పెళ్లి కార్డులు అనేవి మనకు మార్కెట్ లో లభిస్తున్నాయి. అయితే మన పూర్వీకుల పెళ్ళిళ్ళు చేసుకునే సమయంలో ఎటువంటి పెళ్లి కార్డులు ఉండేవి అని తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది.

                                                     

Advertisement

Advertisement

కానీ అప్పట్లో పెళ్లి కార్డులు ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేవు కాబట్టి పెద్దగా ఎవరికి అవగాహన ఉండదు. అయితే మీరెప్పుడైనా రెండో ప్రపంచ యుద్దం సమయంలో పెళ్లికి బంధువులను ఎలా ఆహ్వానించేవారు, పెళ్లి కార్డు ఎలా ఉండేది అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉండేది. అయితే ఆ కాలంలో పెళ్లికి వచ్చే బంధువులు ముదస్తుగానే తమ రేషన్ బియ్యాన్ని పెళ్లి చేస్తున్న కుటుంబానికి నెల రోజుల ముందే అందజేయాల్సి ఉంటుంది.

 

అంతేకాక ఈ కార్డుపై మనం ఇప్పడు కార్డుపై రాస్తున్నట్టు శ్రీరస్తు, శుభమస్తు, కళ్యాణమస్తు అని కాకుండా వందేమాతరం, శాంతి, స్వాతంత్ర్యం అభ్యుదయం అనే జాతీయోద్యమ మాటలు ప్రతి ఒక్క పెళ్లి కార్డుపై ఉండేవి. అలా ప్రతి ఒక్క సందర్భంలో జాతీయోద్యమ సమరం ఎక్కడా నీరుగారకుండా అప్పట్లో నాయకులు వ్యవహరించే వారు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఒకప్పటి కార్డుతో కలిపి ఇప్పటి కార్డును పోల్చుకుంటూ నెటిజన్లు ఆసక్తిగా గమనసితున్నారు. మీకూ అప్పటి పెళ్లి కార్డును చూడాలని ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి

Visitors Are Also Reading