ముంబై ఇండియన్స్ జట్టులో పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఐపిఎల్ 2024 టోర్నమెంట్ కు ముందు ముంబై జట్టు లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ను పక్కకు జరిపిన యాజమాన్యం… హార్దిక్ పాండ్యాను నియామకం చేసింది.
గుజరాత్ జట్టు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను ప్రత్యేకంగా కొనుగోలు చేసి మరి ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. దీంతో ముంబై ఇండియన్స్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. త్వరలోనే ముంబై ఇండియన్స్ జట్టుకు గుడ్ బై చెప్పనున్నారట సచిన్ టెండూల్కర్. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్ గా సచిన్ టెండూల్కర్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ మార్పుపై కాస్త అలిగిన సచిన్ టెండూల్కర్… ఈ నిర్ణయం తీసుకున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.