టీమిండియా స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగుళూరులో చికిత్స తీసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో కాలు స్లిప్ అవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ సమయానికి హార్దిక్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ పరిస్థితులను చూస్తుంటే హార్దిక్ పాండ్యా మరికొన్ని రోజులు కొన్ని మ్యాచ్లకు దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. కానీ ఇంగ్లాండ్ మ్యాచ్ లేదా శ్రీలంక మ్యాచ్ సమయానికి పాండ్యాను రెడీ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గాయంతో బాధపడుతున్న పాండ్యాకు సరైన ఇంజక్షన్లు ఇస్తే తక్కువ సమయంలో పాండ్యా కోలుకునే ఛాన్స్ ఉందట. ఇదే జరిగితే పాండ్యా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ సమయానికి పాండ్యా సిద్ధమవుతారు. కానీ ఇంజక్షన్స్ ఇస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పాండ్యా సహజంగా కోలుకునే వరకు వెయిట్ చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా టీమిండియాకు 3డి ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. పేస్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో రాణిస్తున్నాడు.
Advertisement
Advertisement
జట్టుకు అవసరమై నప్పుడు ఆపద్బాంధవుడిగా మారిపోతాడు. హార్దిక్ పాండ్యా చివర్లో వచ్చి జట్టును విజయతీరాలకు చేసిన రోజులు ఇప్పటికీ మర్చిపోలేము. హార్దిక్ ప్రపంచకప్ లోను పరవాలేదనిపించాడు. కీలక వికెట్లు తీయడంలో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం పాండ్యా లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. పేస్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. దీంతో షమీ వంటి సీనియర్ పై ఆధారపడుతున్నారు. ఇది ఇలా ఉండగా… ప్రపంచకప్ లో ఇప్పటికే 25 మ్యాచ్లు ముగిశాయి. అందులో టీమిండియా ఐదు మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్లు గెలిచింది. రోహిత్ సేన తన తదుపరి మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడనుంది. లక్నో వేదికగా ఆదివారం ఇరుజట్లు తలపడనున్నాయి.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.