ఒక్కోసారి సరదాగా అన్న మాటలు కూడా సీరియస్ గా అవుతాయి. లేనిపోని తలనొప్పులు తీసుకువస్తాయి. పదిమందితో మాటలు పడేలా కూడా చేస్తాయి. ఇక క్రికెటర్ బజ్జీ మాటలు కూడా అతనికి తలనొప్పిని తీసుకువచ్చాయి. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి, క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ బ్యాట్ ఎండ్ లో హిందీ కామెంటేటర్ గా పని చేస్తున్న స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆ పని చేస్తూనే సరదాగా ఓ కామెంట్ చేశారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కోహ్లీ భార్య అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ భార్య అథియ మాట్లాడుకుంటూ కెమెరాకి కనిపించారు. అయితే వీరిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోని స్క్రీన్ పై చూసిన బజ్జి వాళ్లకు క్రికెట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చని, బహుశా వారు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారెమోనని ఓ కామెంట్ విసిరారు.
Advertisement
Advertisement
అంతే ఆ కామెంట్ ఇప్పుడు బజ్జీని తీవ్ర విమర్శల పాలుచేస్తుంది. వారి ప్రొఫెషన్ ని మధ్యలోకి లాగుతూ బజ్జి ఇలా కామెంట్ చేయడం బాగోలేదన్న టాక్ ఆటు బాలీవుడ్ లోను వినిపిస్తోంది. దానికి తోడు ఆడవారంటే అంత చులకన…. వారికి క్రికెట్ నాలెడ్జ్ ఎందుకు ఉండదు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.