టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గత కొద్ది రోజులుగా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరు అనేకసార్లు కలిసి తిరుగుతూ మీడియా కంటపడ్డారు. వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమన్నా విజయ్ కి ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఒకటి వైరల్ అయింది.
Advertisement
రీసెంట్ గా ఇద్దరూ ఓ పార్టీకి వెళ్లి కారులో తిరిగి వెళుతుండగా మీడియా కండ పడ్డారు. దాంతో వీరిద్దరి డేటింగ్ వార్తలు మరోసారి ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా విజయ్ వర్మ రిలేషన్షిప్ పై విజయ్ వర్మ స్నేహితుడు… సహనటుడు గుల్షన్ దేవయ్య షాకింగ్ కామెంట్ లు చేశాడు. విజయ్ వర్మ తన సోషల్ మీడియాలో దహద్ అనే వెబ్ సిరీస్ టీజర్ ను పోస్ట్ చేశాడు. ఈ టీజర్ పోస్ట్ కు గుల్షన్ స్పందించాడు. నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావు… నాకు సరైన బుద్ధి చెప్పావు విజయ్.
Advertisement
ఇంకా నా పరువు తీసినందుకు నీకు చాలా థాంక్స్. లేకపోతే ఏం జరిగిందో హే రామ్….. అంటూ కామెంట్ చేశాడు. అయితే గుల్షన్ విజయ్ ని ఆటపట్టించేందుకే ఈ రకమైన కామెంట్ చేశాడు. కాగా గుల్షన్ కామెంట్ కు విజయ్ రిప్లై ఇవ్వలేదు…. కానీ అతడు చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే అసలు తమన్నా విజయ్ వర్మ రిలేషన్ షిప్ లో ఉన్నారా లేదంటే స్నేహం మాత్రమేనా అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మాత్రం ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.