Auto Mobiles : మనం ఇండియాలో అనేక రకాల వాహనాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని వాహనాలు ప్యాసింజర్స్ ప్రయాణించేవి ఉన్నాయి. కొన్ని టూవీలర్ వాహనాలు కూడా ఉన్నాయి. అయితే సరుకులను తీసుకుపోయే వాహనాలలో ట్రక్కులు ఒకటి. ఈ ట్రక్కుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాష్ట్రాలను దాటి మరి ఈ ట్రక్కులు ప్రయాణం చేస్తాయి. ఇలాంటి వస్తువులను అయినా… అలాగే ఆహార పదార్థాలను కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలిస్తారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఆహార పదార్థాలను ఇతర వస్తువులను తీసుకుపోవడానికి ముఖ్యంగా ట్రక్కులు మాత్రమే ఉపయోగపడతాయి.
సుదీర్ఘ ప్రాంతాలకు ఈ ట్రక్కులు మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ఈ ట్రక్కుల పై కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ట్రక్కులలో ఏసీ క్యాబిన్ కచ్చితంగా ఉండాలని తయారీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర రవాణా శాఖ. అక్టోబర్ ఒకటో తేదీ 2025 సంవత్సరం తర్వాత నుంచి తయారు చేయబోయే ట్రక్కులలో కచ్చితంగా ఏసి క్యాబిన్ ఉండాల్సిందేనని అధికారిక ప్రకటన చేసింది కేంద్రం. ఎన్ 2,N3 కేటగిరి పరిధిలోకి వచ్చే ట్రక్కులలో కచ్చితంగా ఏసి క్యాబిన్ ఉండాల్సిందేనని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
Advertisement
Advertisement
అయితే డ్రైవర్ల సౌకర్యం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎండ, వేడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తప్పు డ్రైవర్లు చాలా ధైర్యంగా వాటిని నడుపుతారు. ఇంజన్ నుంచి వచ్చే వేడిని పట్టుకొని పనిచేస్తారు డ్రైవర్లు. అయితే వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏసీ క్యాబిన్ తయారు చేయాలని… తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. ఆర్థిక వ్యవస్థలో డ్రైవర్లది కీలక పాత్ర… అలాంటి వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం స్పష్టం చేసింది.