Home » యూజర్లకు గూగుల్ పే హెచ్చరిక… ఈ పొరపాటు చెయ్యదంటూ…!

యూజర్లకు గూగుల్ పే హెచ్చరిక… ఈ పొరపాటు చెయ్యదంటూ…!

by Sravya
Ad

సదుపాయాలు పెరికే కొద్దీ, మనకి మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి సైబర్ సెక్యూరిటీ ఎంత దృఢంగా ఉంటున్నా కూడా చిన్న చిన్న తప్పులు కారణంగా మోసాలు జరిగిపోతున్నాయి ప్రపంచంలోనే యూపీఐ యాప్లలో ఒకటైన గూగుల్ పే తన వినియోగదారులకు హెచ్చరికని జారీ చేసింది. యూపీఐ పేమెంట్ చేసే టైంలో కొన్ని యాప్స్ ని అసలు వినియోగించద్దని చెప్పింది. మరి ఇక పూర్తి వివరాలను ఇప్పుడే మనం తెలుసుకుందాం.

Advertisement

గూగుల్ పే ని చాలామంది వాడుతున్నారు ఈజీగా మనం డబ్బులని ఇతరులకి పంపొచ్చు. అలానే, ఇతరుల నుండి డబ్బుల్ని పొందొచ్చు. తరచూ వినియోగదారులు స్క్రీన్ షేరింగ్ యాప్ ని ఫోన్ లో ఎనేబుల్ అయి ఉండగానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అని అలా చేయొద్దని గూగుల్ పే వార్నింగ్ ఇచ్చింది. టార్గెట్ అయ్యే అవకాశం ఉందని చెప్పింది గూగుల్ పే వాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్క్రీన్ షేరింగ్ యాప్స్ ని ఉపయోగించవద్దని సూచించింది.

Advertisement

కొన్ని ఫ్రాడ్ సంస్థలు వినియోగదారులు స్క్రీన్ షేరింగ్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసే విధంగా చూస్తోందని, ఇలా మోసాలు జరుగుతున్నాయని గూగుల్ పే హెచ్చరించింది. గూగుల్ పే ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తోంది. ఏ కారణం చేతనైనా థర్డ్ పార్టీ యాప్ ని డౌన్లోడ్ చేయమని ఇన్స్టాల్ చేయమని గూగుల్ పే మిమ్మల్ని ఎప్పుడూ అడగదని చెప్పింది సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే అనవసరంగా ఖాతా ఖాళీ అయిపోతుంది. అప్పుడు బాధపడాల్సి ఉంటుంది అలానే ఓటీపీలు కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అనవసరంగా మోసగాళ్ల వలలో చిక్కుకోవాల్సి ఉంటుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading