ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే…..ఇది కేవలం సినిమా డైలాగ్ కాదు ఒకప్పటి నుండి పెద్దలు చెబుతున్న మాట. అంతేకాకుండా ఆడవాళ్లను అర్థం చేసుకోవడం సృష్టించిన ఆ బ్రహ్మ దేవుడికి సైతం సాధ్యం కాదని అంటారు. కానీ తాజాగా ఆడవాళ్ళ ప్రవర్తన గురించి మానసిక నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే ఈ నియమాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయని చెబుతున్నారు.
Advertisement
అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిలతో ఇలా ప్రవర్తిస్తారు అని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం….. బాగా నచ్చిన అబ్బాయి కోసం అమ్మాయిలు తమను తాము సైతం వదులుకుంటారట. అంటే తమ బలాలు బలహీనతలను తమకు నచ్చిన అబ్బాయికి చెప్పుకుంటారట. అదేవిధంగా వారికి భయాలు ఉన్న అబద్రత భావాలను సైతం చెబుతారాట. అంతే కాకుండా తమకు ఎలాంటి సందేహాలు అయినా ఉంటే అవి నచ్చిన అబ్బాయిని అడిగి తెలుసుకుంటారట.
Advertisement
నచ్చిన వ్యక్తితో ఎప్పుడూ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారట. వారి ప్రేమని పొందటానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారట. వారితో సినిమాలకు వెళ్లడం షాపింగ్ లకు వెళ్లడం, డేటింగ్ కు వెళ్లడం లాంటివి చాలా ఇష్టపడతారట. అంతేకాకుండా ప్రతి ఆనందాన్ని తమకు నచ్చిన వ్యక్తి నుండే కోరుకుంటారట. తమకు నచ్చిన అబ్బాయి ఎలాంటి వాడైనా అతడికి సపోర్టివ్ గా ఉంటారట. తమకు నచ్చిన అబ్బాయికి నచ్చిన పనులనే చేస్తారట. వారికి ఇష్టం లేని పనుల జోలికి వెళ్లకుండా వారి కోసం నచ్చిన పనులను చేస్తూ వారి అలవాట్లను సైతం మార్చుకుంటారట.
ALSO READ :కోపం ఎందుకు వస్తుంది…? దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి?