జీవితంలో పెళ్లి ఒకేసారి జరుగుతుంది. పెళ్లి తరవాత జీవితాంతం తమ భాగస్వామితోనే కలిసి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి పెళ్లి చేసుకునే ముందు తమకు కాబోయే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా పెళ్లి విషయంలో అమ్మాయిలు ఎక్కువ జాగ్రత్త పడాలి. వయసు పెరుగుతుందని..మంచి సంబంధం అని ఇతర కారణాలతో వారిపై కుటుంబం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లు ఆచితూచి అడుగు వేయాలి.
Advertisement
ఇక తాము చేసుకోబోయేవారి ద్వారానే వారి గురించి తెలుస్తుంది కాబట్టి కొన్ని విషయాలను తప్పక అడగాలి. కుటుంబ సభ్యులు అబ్బాయి ఆర్థికపరిస్థితి గురించి చెప్పినా కూడా అమ్మాయి అతడిని కూడా అడగాలి. నెలకి ఎంత సంపాదిస్తారు వారి ఆస్తుల వివరాలు ఏంటి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాంతో పెళ్లి తరవాత తాము ఎలా నడుచుకోవాలి. తమ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అమ్మాయికి ముందుగానే తెలిసిపోతుంది.
Advertisement
అంతే కాకుండా నివాసించే స్థలం గురించి కూడా అమ్మాయి తెలుసుకోవాలి. ఉద్యోగం చేయాలని అనుకునే అమ్మాయి అయితే ఆఫీస్ కు దగ్గర అవుతుందా లేదంటే దూరం అవుతుందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. దాంతో ఆ తరవాత సమస్యలు రాకుండా ఉంటాయి. మూడవది చాలా ముఖ్యమైనది పెళ్లి తరవాత అబ్బాయి కుటుంబంతో కలిసి ఉంటాడా లేదంటే విడిగా ఉంటాడా అన్న విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి.
కొంతమంది అమ్మాయిలు భర్తతో సింగిల్ గా ఉండాలని ఇష్టపడతారు. అలాంటి వాళ్లు కుటుంబంతో కలిసి ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తరచూ గొడవలు పడుతూ ఉంటారు. మరికొందరు అత్తా మామలతో కలసి ఉండాలని అనుకుంటారు. కాబట్టి పెళ్లి తరవాత కుటుంబంతో ఉంటారా లేదా అన్న సంగతి కచ్చితంగా తెలుసుకోవాలి.