ఇండస్ట్రీలో ఆఫర్ లు వచ్చినంత కాలం హీరోయిన్ లు ఫుల్ బిజీగా ఉంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ జేబులు నింపుకుంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే ఆఫర్ లు వస్తున్న సినిమాలకు గుడ్ బై చెబుతారు. ఆ లిస్ట్ లో హీరోయిన్ జనీలియా కూడా ఉందనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న జనీలియా ఒక్కసారిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది. టాలీవుడ్ తో పాటూ తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసి జెనీలియా అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
అయితే తెలుగులోనే ఈ అమ్మడికి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఢీ, రెడీ, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. సినిమాల్లో ఎంత చలాకీగా కనిపిస్తుందో అంతే చలాకీగా బయట కూడా కనిపించడం విశేషం. ఇక జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరవాత జెనీలియా ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయింది.
Advertisement
అంతే కాకుండా సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. కాగా ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాలకు గుడ్ బై చెప్పడానికి గల కారణం ను జెనీలియా బయటపెట్టింది. పెళ్లి తరవాత పూర్తి బాధ్యతలు పోషించాలనుకున్నానని తెలిపింది. ఇల్లాలిగా తల్లిగా బాధ్యతలు చూసుకోవాలనుకున్నట్టు పేర్కొంది. పూర్తి సమయం పిల్లల కోసం కేటాయించాలనుకున్నట్టు పేర్కొంది. ఇక ఇన్నేళ్ల తరవాత రీఎంట్రీ ఇస్తున్నానని చాలా సంతోషంగా ఉందని చెప్పింది.