బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి తాను మళ్ళీ కేకేఆర్ తో కలవనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం కూడా ప్రకటించింది. లక్నో సూపర్ జేయింట్స్ నుంచి తాను బయటకు వచ్చేసినట్లు గంభీర్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే కేకేఆర్ ఈ ట్వీట్ చేసింది. గంభీర్ మళ్లీ కేకేఆర్ తో కలుస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్ కూడా ఈ వార్తపై సంతోషం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
తాజాగా గౌతమ్ గంభీర్ కూడా ఈ వార్త స్పందించారు. కేకేఆర్ మెంటర్ గా రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. “నేను తిరిగి వచ్చా ఆకలిగా ఉన్నాను” అంటూ ట్వీట్ చేశాడు ఈ లెజెండ్. గత రెండు సీజన్లుగా లక్నో సూపర్ జేయింట్ మెంటర్ గా గంభీర్ వ్యవహరించాడు. 2022 మెగా వేలంలో ఆ జట్టు కూర్పును నిర్ణయించడంలో కూడా అతను కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
ఇక కేకేఆర్ తో గౌతమ్ గంభీర్ అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అతను 2011 నుంచి 2017 వరకు కేకేఆర్ తరఫున ఐపీఎల్ ఆడాడు. వీటిలో కూడా 2012, 2014 రెండు సీజన్లలో గంభీర్ సారధ్యంలోనే ఈ టీం కూడా ట్రోఫీని అందుకుంది. తద్వారా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధికసార్లు ట్రోఫీలు నెగ్గిన ఫ్రాంచైజీగా కేకేఆర్ టీం నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. తిరిగి కేకేఆర్ టీమ్ లోకి వస్తున్నాడు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.