Home » Garlic Benefits: వెల్లుల్లిని ఈ విధంగా తింటూ ఉంటె.. మీ బిపి బాగా కంట్రోల్ అవుతుంది!

Garlic Benefits: వెల్లుల్లిని ఈ విధంగా తింటూ ఉంటె.. మీ బిపి బాగా కంట్రోల్ అవుతుంది!

by Srilakshmi Bharathi
Ad

నిన్నటి జనరేషన్ వరకు.. అంటే మన అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్న టైం లో బీపీలు, షుగర్లు అంత త్వరగా ఎవరికీ వచ్చేవి కాదు. కనీసం అరవై ఏళ్ళు దాటితే తప్ప ఇలాంటి సమస్యలు ఎదురయ్యేవి కాదు. కానీ, మారుతున్న జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వలన ఇప్పుడు చాలా మందికి చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. పని ఒత్తిడి వలనే తొంభై శాతం మంది బిపి బారిన పడుతున్నారు. రక్తపోటు పెరిగి రక్త ప్రసరణలో ఇబ్బందుల వలనే గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తోంది.

Advertisement

అయితే.. ఇలాంటి ప్రమాదకర జబ్బులు రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. పురాతన కాలం నుంచి అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను నమ్ముకోవాలి. మన వంటింట్లోనే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే అనేక ఔషధాలు ఉన్నాయి. వాటిలో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే అలిసిన్ అనే ఓ రసాయనం మన శరీరంలో రక్తపోటు పెరగకుండా కాపాడుతుంది. ఇది చాల ఘాటుగా ఉంటుంది. దీన్ని డైరెక్ట్ గా తినడం వలన గ్యాస్ సమస్యలు వస్తాయి.

Advertisement

అయితే రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలి అని అనుకునే వారు రెండు వెల్లుల్లి రెబ్బలను ప్లేట్ లో వేసుకుని దానిపై వేడి వేడి అన్నాన్ని వెయ్యాలి. ఈ వేడికి వెల్లుల్లి లోని ఘాటు తగ్గుతుంది. ఆ వెల్లుల్లిని ఆ అన్నంతో కలిపే తీసుకోవచ్చు. నిత్యం మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లి ని భాగం చేయడం, కూరల్లో కూడా వెల్లుల్లిని ఉపయోగించడం వలన రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలకి చెక్ పెట్టేయచ్చు. వెల్లుల్లిని ఆహారంలో తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయట. రక్తంలో ఉండే అధిక కొలెస్టరాల్ తగ్గి మీ బరువు అదుపులో ఉంటుందట.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading