ఒకప్పుడు సినిమాల్లో నటిస్తేనే సెలబ్రెటీలు. అంతే కాకుండా టాలెంట్ ఎంత ఉన్నా కూడా నటించాలంటే సినిమాలు లేదా సీరియల్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు…టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. టాలెంట్ ఉంటే సెల్ ఫోన్ లోనే సినిమాలు తీసేయవచ్చు. ఆ సినిమాను యూట్యూబ్ లో విడుదల చేస్తే కోట్లల్లో ప్రేక్షకులు చూస్తారు. ఇక అలా యూట్యూబ్ ద్వారా తన టాలెంట్ తో ఎదిగినవారిలో గంగవ్వ కూడా ఒకరు.
Advertisement
మైవిలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ్వ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. పల్లెటూరులో జరిగే కార్యక్రమాలు మనుషుల జీవనవిధానం ను చూపించడంతో పాటూ చిన్న కథలను రాసుకుని మైలేజ్ షో లో విడుదల చేస్తుంటారు. అలా మైవిలేజ్ షో షార్ట్స్ ఫిల్స్ లో నటించి గంగవ్వ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తరావాత బిగ్ బాస్ లోకి సైతం గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది.
Advertisement
కానీ అనారోగ్య కారణాల కారణంగా ఎక్కువ కాలం హౌస్ లో ఉండలేకపోయింది. ఇక బిగ్ బాస్ తరవాత గంగవ్వ క్రేజ్ మరింత పెరిగింది. తెలియనివారికి కూడా గంగవ్వ ఎవరో తెలిసిపోయింది. ఇదిలా ఉంటే గంగవ్వ తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బిగ్ బాస్ లో తాను ఐదు వారాల పాటూ ఉన్నానని చెప్పింది.
అంతే కాకుండా ఐదువారాలకు గానూ తనకు 10 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్పింది. ఇక నాగార్జున తనకు రూ.7లక్షల రూపాయలు ఇచ్చారని పేర్కొంది. కొత్త ఇల్లు కట్టుకోవడానికి రూ.20 లక్షలు ఖర్చైందని చెప్పింది. బిగ్ బాస్ లో మరిన్ని వారాలు ఉండాల్సిందని కానీ అప్పుడు అర్థం కాలేదని చెప్పింది.
ALSO READ :“బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?