టీమిండియాకు తన దూస్రా బౌలింగ్ హర్బజన్ సింగ్ అనేక విజయాలను అందించాడు. అయితే హర్భజన్ సింగ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే హర్భజన్ సింగ్ తర్వాత ఏం చేస్తాడనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. అయితే హర్భజన్ సింగ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం త్వరలోనే ఆయన ఒక పార్టీలో చేరుతారని తెలుస్తుంది. అయితే క్రికెట్ కు రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పుట్టిన పంజాబ్ రాష్ట్రానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. అయితే ఈ సేవ రాజకీయ రూపంలో ఉంటుందా అనే దాని పై ఇంకా నిర్ణయం తీసుకోలేనని అన్నారు.
Advertisement
Advertisement
అయితే తనకు రాజకీయాల గురించి తెలుసు అని అన్నారు. రాజకీయ రంగం ఎలా ఉంటుందో తనకు అవగాహన ఉందని అన్నారు. ఇప్పటికే పలు పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్నాయని తెలిపారు. అయితే తాను ఏ పార్టీలో చేరుతానో ఇప్పుడే ఏం చేప్పలేనని అన్నారు. అయితే తాను రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా అందరికీ చెబుతానని అన్నారు. అయితే ఇటీవల పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవ జ్యోత్ సింగ్ సిద్ధూ తో హర్భజన్ సింగ్ సమావేశం అయ్యాడు. అప్పటి నుంచే హర్భజన్ సింగ్ రాజకీయాలకు వస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. అయితే తాను ఓ క్రికెటర్ గానే నవజ్యోత్ సింగ్ సిద్ధూ తో భేటీ అయ్యానని అన్నారు. కానీ త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.