ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఫిట్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అసలు ఆ స్థాయికి వచ్చిన వ్యక్తులు రోజులో ఎక్కువ సమయం సేపు పని చేయాల్సి ఉంటుంది.
Advertisement
ఒక్కోసారి ఓవర్ టైం కూడా పని చేయాల్సి ఉంటుంది. అందుకు పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. అయితే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంత ఫిట్ గా ఉండడానికి కారణం ఏంటి..? ఆయన తీసుకునే ఆహార పదార్ధాలు ఏమిటి? ఆయన ఏమేమి ఇష్టంగా తింటారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను తీసుకునే ఫుడ్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారట. సాధారణంగా ఎన్నికలు అనేవి ఏ రాజకీయ నాయకుడికి అయినా సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ టైం లో తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటారు. కానీ సీఎం జగన్ ఎంతటి ఒత్తిడిలో అయినా ఫుడ్ విషయంలో కంట్రోల్ గా ఉంటారట. ఇప్పటి నుంచి కాదు.. ఆయన మొదటి నుంచి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని తీసుకున్నారనే విషయం చాలా మందికి తెలియదు.
Advertisement
సీఎం జగన్ కు మామిడిని తురిమి చేసిన పులిహోర అంటే చాలా ఇష్టమట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అలాగే ఆయన ఎప్పుడు విజయవాడకు వచ్చినా.. కచ్చితంగా మామిడికాయ పులిహోరను తన ఆహారంతో పాటు తీసుకునేవారట. అలాగే ఎంత ఒత్తిడి ఎదురవుతున్నా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సీఎం జగన్ తన చిరునవ్వుని చెదరనివ్వరు. సీఎం జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా డాక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన తన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త తీసుకునేవారు. అలాగే యోగా, ధ్యానం వంటి క్రమం తప్పకుండా కుటుంబ సభ్యులందరిచేతా చేయించేవారు. దీనితో.. అందరికి అవి అలవాటు అయిపోయి.. వారి జీవితంలో భాగం అయ్యాయి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!