Home » ఎన్టీఆర్ విశ్వనాథ్ లు ఎందుకు గొడవపడ్డారు? గొడవ కారణంగా 14 ఏళ్లు మాట్లాడుకోలేదా?

ఎన్టీఆర్ విశ్వనాథ్ లు ఎందుకు గొడవపడ్డారు? గొడవ కారణంగా 14 ఏళ్లు మాట్లాడుకోలేదా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కె విశ్వనాధ్ కు, టాలీవుడ్ కు అన్నగారైన ఎన్టీఆర్ కు మధ్య గొడవ అయ్యిందన్న విషయం చాల మందికి తెలియదు. ఇద్దరు టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులే. తన డైరెక్షన్ లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన విశ్వనాధ్.. నటుడిగానూ రాణించారు. చాలా సినిమాల్లో కీలక పాత్రలు చేసి.. మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన మరణం తరువాత.. ఆయన గురించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ కు, టాప్ డైరెక్టర్ విశ్వనాధ్ కు మధ్య గొడవ అయ్యిందట.

ntr-and-viswanath

Advertisement

 

వారిద్దరూ దాదాపు పదునాలుగు సంవత్సరాల పాటు అసలు మాట్లాడుకోలేదట. అసలు వీళ్లిద్దరికీ మధ్య జరిగిన గొడవ ఏంటి? ఎందుకు అన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదు? అన్న సంగతి ఇప్పుడు చూద్దాం. వీరిద్దరికి కాలేజీ చదివే రోజుల నుంచే పరిచయం ఉందట. ఎన్టీఆర్ విశ్వనాథ్ కు సీనియర్ అట. ఎన్టీఆర్ చదువు పూర్తి కాగానే సినిమాల వైపు వస్తే.. ఆ బాటలోనే విశ్వనాధ్ కూడా చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి వచ్చారు.

ఆ పరిచయం వల్లే వీరిద్దరి కాంబోలో సినిమాలు వచ్చేలా చేసింది. వీరిద్దరి కాంబోలో చిన్ననాటి స్నేహితులు అనే ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఓ ఎమోషనల్ సన్నివేశంలో ఎన్టీఆర్ నటిస్తున్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నారు. అయితే.. ఆ సన్నివేశానికి సన్ గ్లాసెస్ సూట్ కావని, అవి తీసేయాలని విశ్వనాధ్ చెప్పారట. కానీ అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు. ఈ సినిమా తరువాత, మరో సినిమా కూడా విశ్వనాధ్ డైరెక్షన్ లోనే ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. కానీ, ఈ గొడవ కారణంగా విశ్వనాథ్ ను తప్పించి, యోగానంద్‌ను డైరెక్టర్ గా పెట్టుకున్నారట. దీనితో ఈ గొడవ మరింత ముదిరింది. దాదాపు 14 సంవత్సరాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా తీసిన జననీ జన్మభూమి షూటింగ్ టైం లోనే వీరిద్దరూ తిరిగి మాట్లాడుకున్నారట.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading