బంగ్లాదేశ్ పై సెంచరీ చేసి మరోసారి చేజ్ మాస్టర్ అనిపించుకున్నాడు కోహ్లీ. గత వరల్డ్ కప్ లో ఒక్క శతకం కూడా నమోదు చేయలేకపోయిన కోహ్లీ ఈ వరల్డ్ కప్ ను ఘనంగా ఆరంభించాడు. ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడిన భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియాపై కోహ్లీ సెంచరీ సాధిస్తాడని అనుకున్న తృటిలో మిస్ అయింది. ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేసిన కోహ్లీ క్యాచ్ అవుట్ అయ్యాడు. సెంచరీ మిస్ కావడంతో కోహ్లీ చాలా బాధపడ్డాడు. డకౌట్ లో కూర్చొని తలను బాదుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు.
తాజాగా పాక్ పై 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక నిన్న పూణే వేదికగా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన రన్ మెషిన్ ఎట్టకేలకు బంగ్లాపై శతకం నమోదు చేశాడు. సెంచరీకి మూడు పరుగులు చేయాల్సిన సమయంలో సిక్స్ బాది ఈ ప్రపంచకప్ లో తొలి సెంచరీ సాధించాడు. అయితే కోహ్లీ సెంచరీ సాధించడానికి హార్దిక్ పాండ్యాకు ముడి పెడుతున్నారు నెటిజన్స్. గతంలో హార్దిక్ పాండ్యా చేసిన మిస్టేక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ప్రపంచకప్ కు ముందు వెస్టిండీస్… తిలక్ వర్మ 49 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి విజయ లాంచనాన్ని పూర్తి చేశారు. అయితే ఆ సమయంలో పాండ్యా సిక్స్ కొట్టాల్సిన అవసరం లేదు. అప్పటికే విజయం టీమిండియా చేతిలో ఉంది.
Advertisement
Advertisement
తిలక్ వర్మకు స్ట్రైక్ ఇచ్చి ఉంటే తన ఓడిఐ కెరియర్ లో తొలి హాఫ్ సెంచరీ ఛాన్స్ దక్కేది. కానీ పాండ్యా సిక్స్ కొట్టి తిలక్ వర్మ హాఫ్ సెంచరీని అడ్డుకున్నట్టు అయింది. ఈ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో కేఎల్ రాహుల్ 97 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అప్పుడు కూడా పాండ్యా సిక్స్ కొట్టి రాహుల్ సెంచరీకి అడ్డుపడ్డాడని ట్రోల్ చేశారు. చివర్లో పాండ్యా సిక్స్ కొట్టకుండా ఉంటే రాహుల్ సునాయాసంగా సెంచరీ పూర్తిచేసుకుని ఉండేవాడు. ఇక తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 103 పరుగులతో శతకం బాదాడు. నిజానికి మరో ఎండ్ లో పాండ్యా ఉండి ఉంటే కోహ్లీ సెంచరీ చేసేవాడు కాదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనిపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- పవన్ లేకుండా.. రేణు దేశాయ్ ఇంత లగ్జరీ లైఫ్ గడపటానికి అలాంటి బిజినెస్ చేశారా ?
- టాలీవుడ్ సింగర్ గీతా మాధురి విడాకులు….అసలు వాస్తవం ఇదే!
- ఒకే జెండర్ వాళ్లు పెళ్లి చేసుకుంటే తప్పేంటి – మంచు లక్ష్మి