Home » తన తప్పును జట్టు మొత్తం మీద నెడుతున్న రాహుల్..?

తన తప్పును జట్టు మొత్తం మీద నెడుతున్న రాహుల్..?

by Azhar
Ad
భారత జట్టుకు ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్.. రోహిత్ శర్మ తర్వాత భవిష్యత్ కెప్టెన్ అని అనిపించుకుంటున్నాడు. కానీ అతని ప్రవర్తన అనేది చూస్తుంటే మాత్రం అలా అనిపించడం లేదు. రాహుల్ మాటలను చూస్తుంటే.. అతను జట్టు కోసం కాకుండా తన కోసం ఆడుతున్నాడు అనే వాదన నిజం అని అందరికి అనిపిస్తుంది.
ఆసియా కప్ లో ఓపెనర్ గా కోహ్లీ సెంచరీ చేయడంతో.. తర్వాతి మ్యాచ్ ల్లో కూడా కోహ్లీ ఓపెనర్ గా వస్తాడా అని ప్రశ్నించగా.. నన్ను పక్కన కూర్చోమంటారా అంటూ సమాధానం ఇచ్చాడు. ఇది పెద్ద వైరల్ గా మారింది. ఇక ఆసియా కప్ లో పూర్తిగా విఫలం అయిన రాహుల్.. చాలా స్లో గా ఆడుతూ స్ట్రైక్ రేట్ అనేది మెంటన్ చేయలేకపోయాడు.
ఇదే ప్రశ్నను ఈరోజు మీడియా తనకు వేయగా.. తన విషయంలో సమాధానం చెప్పాల్సింది పోయి.. జట్టు మొత్తంలో బ్యాటర్లు అందరూ అలానే ఉన్నారు. నేను ఒక్కడినే కాదు అంటూ చెప్పాడు. ఏ కెప్టెన్ అయిన జట్టులోని ఆటగాళ్లు చేసిన తప్పులను భరిస్తూ వారికీ అండగా నిలుస్తాడు. కానీ రాహుల్ మాత్రం.. ఇలా జట్టు మొత్తం అలానే ఉంది అంటూ తన తప్పును అందరితో పంచుకోవడం అనేది సరికాదు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనతో రాహుల్ కెప్టెన్ అయితే జట్టు పని అయ్యిపోతుంది అంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading