ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. మన శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా అనారోగ్యం బారిన పడినట్టే. ఆహారం ఎక్కువ తిన్న, ఆహారం తక్కువ తిన్న అనారోగ్య సమస్యలు వేధించినట్లే. మరీ అతిగా ఆకలి వేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..! ఆకలిని నియంత్రించే హార్మోన్ లిప్టిన్ అంటారు. ఈ హార్మోన్ రిలీజ్ అయితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఒకవేళ ఈ హార్మోన్ తగ్గితే విపరీతమైన ఆకలి వేస్తుంది. కొంతమంది అస్తమానం ఏదో ఒకటి తింటూనే ఉంటారు. రెండు, మూడు గంటలకు ఒకసారి తింటూనే ఉంటారు. ఇలా విపరీతంగా తినడం వల్ల అధిక బరువు పెరుగుతారు.
Advertisement
ఇలా ఆకలిని నియంత్రించడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. పాలకూరను తీసుకుంటే ఆకలి అదుపులో ఉంటుంది. పాలకూరలో ఉండే థైలకాయిడ్ అనే రసాయనం ఆకలిని నియంత్రిస్తుందని సైంటిఫిక్ గా 2020లో ఒబిసిటీ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ రిసెర్చ్ సెంటర్ ఇరాన్ వారు రీసెర్చ్ చేశారు. ఇలా ఆకలిని నియంత్రించడానికి ఏది ఉపయోగపడుతుంది అని చూస్తే ఈ థైలకాయిడ్ అనే కెమికల్ పాలకూరలో ఉండటంవల్ల ఆకలిని నియంత్రించి, గ్యాస్ట్రెటీస్ రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. ఆకలి ఎక్కువగా ఉన్న వారికి పొట్టలోని ప్రేగుల్లో యాసిడ్స్,జ్యూసెస్ ఊరుతుంటాయి. ఇవి అతిగా ఊరడం వల్ల గ్యాస్ట్రిక్ లైనింగ్ ఇరిటేట్ ఎక్కువ అవుతుంది.
Advertisement
ఆ ఇరిటేషన్ వల్లే మనకు కడుపులో మంట, గ్యాస్ట్రైటిస్ మరియు రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటిని నియంత్రించడానికి పాలకూర బాగా ఉపయోగపడుతుంది. పాలకూరని వండుకొని తిన్నప్పుడు అందులో ఉండే ఆక్సలేట్స్ లాంటివి నశిస్తాయి. అలాగే పాలకూరను వండి తినడం వల్ల కిడ్నీలలో కూడా స్టోన్స్ రాకుండా ఆల్కలాయిడ్స్ డ్యామేజ్ అవుతాయి. అతి ఆకలిని నియంత్రించడానికి పాలకూరలో ఉండే రసాయనం బాగా లాభాన్ని ఇస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని వంటల్లో ఒబేసిటీ ఉన్నవారు పాలకూరను వేసుకోండి. ఇలా చేస్తే ఆకలిని నియంత్రించి, అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.