పెరుగు అనేది పాలను పులియబెట్టడం ద్వారా తయారు చేయబడిన పాల ఉత్పత్తి. వేలాది సంవత్సరాలుగా, ఈ పులియపెట్టిన ఆహారం అనేక సంస్కృతులలో ప్రధానమైనదిగా, బహుళ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిందిగా గుర్తింపు తెచ్చుకుంది.చాలామంది ఎండాకాలం తాజా పెరుగు తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఎండాకాలం సరైన మొత్తం లో పెరుగు తీసుకోవడం కూడా మంచిదే.
Advertisement
అయితే.. ప్రతి రోజు ఎక్కువమొత్తంలో పెరుగు తినడం మంచిది కాదు అంటూ ప్రస్తుతం వైద్యులు గట్టిగానే చెబుతున్నారు. నిజానికి పెరుగుని తినడం వలన చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఉండే కాల్షియం ఎముకలను దంతాలను ధృడంగా ఉండేలా చేస్తుంది. పెరుగు తినడం మంచిదే.. కానీ, అతిగా తినడం వలన సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. పెరుగు ప్రోబయోటిక్స్, న్యూట్రిషన్తో ఉన్న ఆహరం. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి, ఇతర పోషకాలు కూడా వస్తాయి. పెరుగుని తినడం ఆరోగ్యకరమే.
Advertisement
కానీ, కొంతమందికి పెరుగు సరిపడదు. పెరుగు తినడం వలన మొటిమలు, స్కిన్ అలర్జీ, జీర్ణ సంబంధ సమస్యలు వస్తుంటాయి. సాధారణంగా వ్యక్తులలో ఉండే వాత, పిత్త, కఫా దోషాలు ఇంబ్యాలన్సు అయితే అనారోగ్యం దరి చేరుతుంది. పెరుగు పులియపెట్టబడిన ఆహరం. సూర్యాస్తమయం అయిపోయాక ఎక్కువగా పెరుగు తినడం వలన జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అయితే.. పెరుగుని ఎక్కువగా తినడం కంటే ఒక గ్లాస్ లో కొద్దిగా పెరుగు తీసుకుని పలుచగా మజ్జిగ చేసుకుని తాగితే చాలా మంచిది. ఇది శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.