Home » ఇలా ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసారంటే… అదిరిపోతోంది అంతే..!

ఇలా ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసారంటే… అదిరిపోతోంది అంతే..!

by Sravya
Ad

ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఉసిరికాయతో మనం పచ్చడి వంటివి ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా బాగా ఉంటుంది ఉసిరిని తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పెరగడం మొదలు అనేక ప్రయోజనాలని కలుగుతాయి ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందు ఉసిరికాయలు తీసుకోండి. అలానే నూనె, ఉప్పు, పసుపు, మెంతులు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి.

Advertisement

Advertisement

ఉసిరికాయని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయని కట్ చేసేసి గింజలను తీసేయాలి. కడాయిలో నూనె వేసి వేడి వేడి నూనెలో ఉసిరికాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి మెంతులు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.

వీటిని ఒక జార్ లో వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, ఉసిరికాయ ముక్కలు, నిమ్మరసం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాలింపుకు సరిపడా నూనె పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత పోపులు వేసుకున్న పచ్చడిలో కలుపుకోవాలి ఇలా ఈజీగా తొక్కు పచ్చడి తయారు చేసుకోవచ్చు. పచ్చడిని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading