నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగబాబు వారసురాలిగా, ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఎన్నో కలలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ నిహారికని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు. దీంతో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమై పలు వెబ్ సిరీస్ లలో నటించి, ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తోంది.
ఇక నిహారిక జొన్నలగడ్డ కృష్ణ చైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట చూడముచ్చటగా ఉండేవారు. ఇక ఏమైందో ఏమో అనుకోని కారణాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం నిహారిక తన పని తాను చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. నిహారికకి తన కుటుంబ సభ్యుల సపోర్ట్ చాలా ఎక్కువ. ముఖ్యంగా తన తల్లి, తండ్రి సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నిహారిక అనుకున్నది చేయడానికి వారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు.
Advertisement
Advertisement
ఇక ఇటీవల నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ…. నేను అంటే మా అమ్మకి చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఒంటినిండా బంగారు నగలతో నన్ను అలంకరించేది. కానీ నేను బంగారాన్ని పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. ఎక్కడో ఒక దగ్గర పడేసుకునేదాన్ని. బంగారం విలువ నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. నేను చిన్నప్పుడు పోగొట్టిన బంగారంతో ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద భవనాన్ని కొనుగోలు చేయొచ్చు అని నిహారిక చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక చేసిన ఆ తప్పు వల్ల నాగబాబు కొన్ని కోట్లలో నష్టపోయాడంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!