ప్రేమైనా పెళ్లైనా అది ఎక్కువ కాలం నిలబడాలి అంటే నిజాయితీగా ఉండటం ముఖ్యం. ఒక బంధంలో అన్నింటి కంటే ముఖ్యమైనది నిజాయితీగా ఉండటమే. ఒక్కసారి భాగస్వామి ఎదుట తమ నిజాయితీని కోల్పోయారు అంటూ అది తిరిగి పొందలేరు. అంతే కాకుండా కొన్ని అబద్దాలను జీవిత భాగస్వాములకు చెబితే తీవ్రమైన సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
Advertisement
గతంలో ఉన్న ప్రేమల గురించి జీవిత భాగస్వాములకు అసలు చెప్పకూడదట. ఒకవేళ చెప్పారంటే అబద్దం మాత్రం చెప్పకూడదట. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో నిజాయితీగా జరిగింది జరిగినట్టు చెప్పాలట. అంతే కాకుండా తమ జీతం లేదా ఆదాయం గురించి కూడా జీవిత భాగస్వాములకు అబద్దాలు చెప్పకూడదట. అలా చెప్పడం వల్ల మిగితా డబ్బులు ఏం చేస్తున్నాడు.
Advertisement
ఆ డబ్బులు ఎవరికి ఖర్చు చేస్తున్నాడు అని అనుమానాలు మొదలై ఆ తరవాత గొడవలకు దారితీస్తాయట. దాంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. జీవిత భాగస్వాముల వల్ల నటించకూడదట. గతంలో తమ ప్రవర్తన ఎలా ఉండేదో అదే విధంగా నడుచుకోవాలట.
రిలేషన్ షిప్ ప్రారంభంలో నటిస్తే ఆ తరవాత ఎలాగూ నిజస్వరూపం బయటపడి గొడవలు జరిగే ప్రమాదం ఉందట. బయటకు వెళ్లినప్పుడు ఎక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు అనే విషయాలను కూడా పార్ట్నర్ అడిగితే నిజం చెప్పాలట. అలా కాకుండా అబద్దాలు చెబితే తమ వద్ద ఇంకా ఎన్ని విషయాలను దాస్తున్నారో అని గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయట.