మనిషి జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం వివాహం. ప్రతి ఒక్కరి జీవితం వివాహానికి ముందు వివాహం తరవాత అనే రెండు పార్ట్ లుగా విభజించవచ్చు. పెళ్లికి ముందు మన జీవితంలో స్నేహితులు, తల్లి తండ్రులు ఉంటారు. కానీ పెళ్లి తరవాత జీవిత భాగస్వామి ఆ తరవాత పుట్టబోయే పిల్లలే ఎక్కువగా ఉంటారు. అంతే కాకుండా పురుషుడికి అయినా స్త్రీకి అయినా పెళ్లయ్యే వరకూ మాత్రమే తల్లితండ్రులు తోడు ఉంటారు.
Advertisement
ఆ తరవాత కష్టసుఖాలను పంచుకునేది జీవిత భాగస్వామే..కాబట్టి వివాహం విషయంలో ఇరువురూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జీవితమే తలక్రిందులు అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఓ మానసిక నిపుణురాలు ఎలాంటి అమ్మాయిలను వివాహం చేసుకోవాలి….ఎలాంటి అమ్మాయితో వివాహం జరిగితే ఇబ్బందులు తప్పవు అనే విషయాలను వివరించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు తమ కంటే ఆస్తి తక్కువగా ఉన్న కుటుంబం నుండి అమ్మాయిని వివాహం చేసుకోవాలని తెలిపారు. అలా చేసుకోవడం వల్ల అబ్బాయికి గౌరవం పెరగటంతో పాటూ అమ్మాయికి ఇదివరకూ ఉన్న జీవితం కంటే మంచి జీవితాన్ని ఇవ్వగలరని అన్నారు. తమ కుటుంబంతో కలిసిపోయే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తెలిపారు. అలా పెళ్లి చేసుకోవడం వల్ల పెళ్లి తరవాత గొడవలు రాకుండా ఉంటాయని చెప్పారు.
అబ్బాయిని కాకుండా అతడి ఉద్యోగాన్ని మరియు ఆస్తిని మాత్రమే చూసి పెళ్లికి ఒప్పుకునే అమ్మాయిలకు దూరంగా ఉండాలని అన్నారు. అలాంటి వారిని చేసుకుండే ఇబ్బందులు తప్పవని చెప్పారు. పెద్దవాళ్లను గౌరవించే లక్షణాలు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవాలని తెలిపారు. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి అత్త మామకు కూడా గౌరవాన్ని ఇస్తుందని దాంతో ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.