ఒకరిపై ప్రేమను పెంచుకోవడం..ఒకరిలో ప్రేమలో పడటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ప్రేమలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే జీవితాంతం బాధపడక తప్పదు. కొంతమంది నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరికొందరు మాత్రం ప్రేమ పేరుతో మోసం చేసి వెళ్లిపోతుంటారు. అలా మోసం చేసేవారిని ఈ 5లక్షణాల ద్వారా పసిగట్టవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అబద్దాలు చెప్పడం
అబద్దాలు చెప్పేవారిని ప్రేమిస్తే మోసపోవడం పక్కా అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్దాలు ఆడేవారు ప్రేమిస్తున్నట్టు నటించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. గొప్పలు చెప్పడం ద్వారా ప్రేమలో పడేసి ఆ తరవాత అవసరం తీరాక వదిలేస్తారని హెచ్చరిస్తున్నారు.
Advertisement
అనుమాన పడటం
చీటికి మాటికి అనుమానపడేవారి మనసు జీవితాంతం అదే విధంగా ఉంటుందట. ఆ అనుమానంతో హించడం లాంటివి కూడా చేస్తారట. అలాంటి వారిని పెళ్లి చేసుకున్నా జీవితాంతం బాధపడాల్సి వస్తుందట.
ఈగో చూపించడం
ఎక్కువ ఈగో ఉన్నవాళ్లు తమ ఈగో కోసం ఏం చేయడానికి సిద్దపడతారట. అలాంటి వారిని పెళ్లి చేసుకున్నాక తమదే పై చేయి అవ్వాలని భావిస్తారట. తేడా వస్తే తమ ఈగో కోసం వదిలేయడానికి సైతం వెనకాడరట.
కోపం ఎక్కవ ఉండటం
ఎక్కువగా కోప్పడేవారు తీసుకునే నిర్ణయాలు కూడా కఠినంగా ఉంటాయట. అలాంటి వారు చిన్న తప్పును కూడా భూతద్దం పెట్టి చూస్తారట. అంతే కాకుండా చిన్న గొడవ జరిగినా కోపంతో రెచ్చిపోయి ఏం చేయడానికైనా వెనకాడరట.
ప్రతిదానికీ అలగటం
అలక అనేది వినడానికి చిన్న విషయంగా కనిపించినా అదే పెద్ద గొడవలకు దారి తీస్తుందట. చిన్న చిన్న చిన్న విషయాలకు అలిగేవారి పై కోపం పెరిగి చివరికి విడాకుల వరకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయట.