మనం నిద్రపోయాక ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కలలో మనకి చాలా కనబడుతూ ఉంటాయి కొంతమందికి కలలో కుక్కలు కనబడుతూ ఉంటాయి. కుక్కలు కలలో కనపడితే దానికి అర్థం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కలలో కుక్క మీ మీద దాడి చేసినట్లుగా కనపడితే సన్నిహితులు ఎవరైనా మిమ్మల్ని చెడు పరిస్థితిలో ఉంచడానికి అందుకు కారణం అవ్వచ్చు. అవి మీకు సమస్యల్ని కలిగిస్తాయని అర్థం. మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఇష్టపడని పనిని మీరు చేసి ఉండొచ్చు. మీ చర్యల కారణంగా కోపంగా వాళ్ళు ఉన్నారని ఇది సూచిస్తుంది.
Advertisement
మీ కలలోకి నిర్దిష్ట రంగు కుక్క కనపడితే వివిధ ప్రభావాలను కలిగి ఉంటుంది. గోధుమ రంగు కుక్క కలలోకి వచ్చిందంటే మంచి సంకేతం కాదని చెప్తున్నారు పండితులు. మీ జీవితంలో నిర్ణయం ఏదైనా తీసుకోవాలనుకుంటే కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించండి. తెలుపు రంగు కుక్క కనుక కలలో కనపడిందంటే మీ స్నేహితుడు మీకు నిజాయితీగా విధేయతతో ఉన్నాడని దానికి అర్థం. మీ కోసం ఏదైనా మంచి చేయాలని ఉద్దేశంతో స్నేహితులు ఉన్నారని దానికి సంకేతం.
Advertisement
కలలో కనుక నల్ల కుక్క కనబడింది అంటే మీ జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని బట్టి జీవితంలో ప్రతికూలతని సూచిస్తుంది. కుక్క వెంబడించినట్లు కలలో కనపడితే జాగ్రత్తగా ఉండాలి కలలో కోపంగా ఉన్న కుక్క కనపడినట్లయితే కూడా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఒత్తిడి నియంత్రణలతో ఉండాల్సిన సమయం ఇదే అని స్వప్న శాస్త్రం చెప్తోంది. ఇలా కలలో కనపడే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. పదేపదే మనం దేని గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తే దానిపై కూడా కలలు వస్తూ ఉంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!