మహిళలు సాధారణం గా ఆభరణాలతో పాటు గాజులు కూడా ధరిస్తారు. ప్రస్తుత రోజులలో మహిళలు బంగారం తో తయారు చేసిన గాజులను కూడా ధరిస్తున్నారు. అంతలా మహిళలు గాజులను ఇష్టపడుతారు. అందం కోసం అలాగే అలంకరణ కోసం ఇలా గాజులను ధరిస్తారు. మహిళలు లను ధరించడం అనేది ఇప్పుడు ఉన్న పద్దతి కాదు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక సంప్రదాయం. ప్రచీన కాలం లో గాజులను మహిళలతో సమానం గా పురుషులు కూడా ధరించే వారు. కానీ కాలం గడుస్తున్న కొద్ది.. గాజులు పురుషులకు దూరంగా.. మహిళలకు దగ్గరగా అవుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం పూర్తి గా మహిళ లే ధరించే విధం గా మారి పోయింది. అయితే గాజులు ధరించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
Advertisement
Advertisement
ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ముందు గా చిన్న పిల్లలు నల్లిటి గాజులు వేస్తారు. దీని వల్ల వారికి దిష్టి తగలకుండా ఉంటుందని నమ్ముతారు. అలాగే మహిళలు గాజులు ధరించడంతో మహిళలలో లయ, లాలిత్యం వస్తుంది. అలాగే ప్రాచీన కాలంలో మహిళలకు జాగ్రత్తలను అలవాటు చేయడానికి చిన్న నాటి నుంచి గాజులును వేయించే వారు. వారి చేతులకు గాజులు వేయడం వల్ల గాజులు పలిగి పోతాయి.. జాగ్రత్త అంటూ చిన్న నాటి నుంచే జాగ్రత్తలను అలవాటు చేసేవారు. ఆ సంప్రదాయమే ఇల మారింది. నిజానికి ప్రస్తుత కాలంలో మహిళలకు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందం కోసం అలంకరణ కోసం ఇంకా గాజులను వాడుతున్నారు.