దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం దేశంలోనే టాప్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఇండియన్ సినిమాకు జక్కన్న పాన్ ఇండియా సినిమా అంటూ కొత్త పదాన్ని తీసుకువచ్చాడు. దాంతో ప్రాంతీయ సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. రాజమౌళి సినిమాలో నటించిన హీరోల వెంట బాలీవుడ్ దర్శకులు నిర్మాతలు క్యూ కడుతున్నారు.
Advertisement
అంతేకాకుండా ఆ హీరోలతో సినిమాలు చేయాలని ఉందని హీరోయిన్స్ సైతం బహిరంగంగా చెబుతున్నారు. ఇక టాలీవుడ్ కు ఇండియన్ సినిమాకు అంత క్రేజ్ తీసుకువచ్చిన జక్కన్న ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా ఇండస్ట్రీ నుండి పలువురు హీరోలు, ప్రముఖ దర్శకులు నిర్మాతలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేసి సంగతి తెలిసిందే.
Advertisement
అంతేకాకుండా సిసిసి అనే చారిటీ ని ప్రారంభించి మెగాస్టార్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు తో పాటు ప్రతి ఒక్క స్టార్ హీరో కోట్లల్లో విరాళాలు అందించారు. అంతేకాకుండా టాలీవుడ్ లోని పలువురు దర్శకులు నిర్మాతలు సైతం కోట్లలో విరాళాలు ఇచ్చారు. అయితే రాజమౌళి మాత్రం విరాళంగా డబ్బులు ఇవ్వలేదు. తాను డబ్బు ఇవ్వనని చెప్పారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఈ విషయమై ప్రశ్న ఎదురైంది.
కరోనా సమయంలో అందరూ విరాళాలు ఇచ్చారు మీరు ఎందుకు ఇవ్వనన్నారు అని ప్రశ్నించగా జక్కన్న ఆసక్తికర సమాధానం చెప్పారు. కరోనా వేళ తాను గానీ తన కుటుంబం గానీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వలేదని చెప్పారు. కరోనా బాధితులకు అందరూ సహాయం చేస్తారని…. కానీ కరోనా బాధితులకు ఆ సమయంలో పోలీసులు డాక్టర్లు ఎంతో సహాయం చేశారని అన్నారు. కాబట్టి సాయం చేసిన వారికి సాయం చేయాలని అనుకున్నట్టు తెలిపారు. డాక్టర్లకు పోలీసులకు తాము హెల్త్ కిట్లు అందజేసినట్టు తెలిపారు.
Also read :
భర్త భార్యపైన ఎంత ప్రేమ ఉన్నా కూడా అస్సలు ఇలా పిలువ కూడదట ..! ఎందుకంటే..?