తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, డిసెంబర్ 3న ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి నూతన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసింది.
కాగా BRS పార్టీకి 39 సీట్లు ఎంఐఎం పార్టీకి 7 సీట్లు అలాగే బిజెపి పార్టీకి 8 సీట్లు ఇతరులకు ఒక సీటు వచ్చాయి. తెలంగాణ ఏర్పడక ముందు ఒక ఎమ్మెల్యే నెలసరి జీతం12000 ఉండగా అది 20000కి పెరిగింది .ఇతర నియోజకవర్గ అలవెన్సులు 83000 నుంచి 2.3 లక్షలు అయినవి. అంటే ఈ లెక్క ప్రకారం 163% పెరిగి తెలంగాణలోని ప్రతి ఎమ్మెల్యే దేశంలోనే ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల కంటే అత్యధిక జీతం పొందుతున్నారు అన్నమాట.
Advertisement
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినప్పుడు రోజు 1000 చెల్లిస్తారు. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 4. 21 లక్షల జీతాన్ని పొందుతున్నాడు అలాగే స్పీకర్ 4.11 జీతం తీసుకుంటున్నాడు. మరియు వారి యొక్క వాహన రుణ పరిమితిని సైతం 15 లక్షల నుంచి 40 లక్షలకు పెంచింది. అలాగే వారికి పరిమితి లేని వైద్యం కూడా అందుతుంది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.