ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఉండడమే కాకుండా… బాలీవుడ్ హీరోలకు కూడా పోటీ ఇస్తున్నాడు. అప్పుడేప్పుడో వచ్చిన గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్. ఆ తర్వాత దేశ ముదురు, ఆర్య, ఆర్య 2 , జులాయి లాంటి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు అందుకున్నాడు అల్లు అర్జున్. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా మారిపోయాడు.
అయితే రెండు సంవత్సరాల కిందట అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప రెండవ భాగం షూటింగ్ జరుగుతోంది. మొత్తానికి పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ ను ఎక్కడికో తీసుకు వెళ్ళింది. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ చేసే యాడ్ ల రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Advertisement
Advertisement
రెడ్ బస్, ఫ్రూటీ మరియు జొమాటో లాంటి ప్రోడక్ట్లకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అయితే పుష్ప సినిమా కంటే ముందు ఈ యాడ్ల కోసం రూ.35 లక్షల వరకు తీసుకునేవాడట బన్నీ. కానీ పుష్ప సక్సెస్ అయిన తర్వాత ఒక్క యాడ్ చేయాలంటే రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందుతాయి. అలా పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!