నటసింహం నందమూరి బాలకృష్ణ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీరామారావు తరవాత ఆయన వారసత్వంగా హరికృష్ణ, బాలకృష్ణలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వారిలో హరికృష్ణ తక్కువ సినిమాలే చేసి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పగా బాలయ్య కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బాలకృష్ణకు నటనలో శిక్షణ ఇచ్చింది కూడా ఎన్టీఆరే కావడం విశేషం. తాను నటించిన దర్శకత్వం వహించిన సినిమాల ద్వారానే బాలకృష్ణను ఎన్టీఆర్ వెండితెరకు పరిచయం చేశారు.
Advertisement
బాలకృష్ణ కూడా తన తండ్రిని దగ్గర నుండి చూసి ఆయన క్రమశిక్షణ మరియు నటనను నేర్చుకున్నానని చెబుతుంటారు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా బాలకృష్ణ తన కెరీర్ లో ప్రయోగాత్మక చిత్రాలు, పౌరాణిక పాత్రలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బాలకృష్ణకు మాత్రం మాస్ హీరోగా ఎంతో ఇమేజ్ సంపాదించుకున్నారు. బాలకృష్ణ సినిమా అంటే కచ్చితంగా యాక్షన్ సన్నివేశాలు భారీ డైలాగులు ఉండాల్సిందే.
Advertisement
చివరగా బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కరోనా కాలంలో వచ్చినా ఈ సినిమా కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ మరోరెండు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా గోపించంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే బాలకృష్ణను ఆయన అభిమానులు పెద్దలు బాలయ్య అని ముద్దుగా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పేరు ఎలా వచ్చిందన్నది చాలా మందికి తెలియదు. నిజానికి దాని వెనక ఓ స్టోరి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం….బి గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలువచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లోనే లారీ డ్రైవర్ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా కోసం రచయిత జొన్నవిత్తుల పాటలను రాశారు. అయితే ముందే బి.గోపాల్ మీరు ఏమైనా రాసుకోండి కానీ పాటలో జై బాలయ్య అని రావాలని చెప్పారట. దాంతో ఆయన సినిమాలోని ఓ పాటలో బాలయ్య..బాలయ్యా గుండెల్లో గోలయ్యా అనే లిరిక్స్ ను రాశారు. ఇక అప్పటి నుండి బాలకృష్ణ అభిమానులకు బాలయ్య అయిపోయారు.