Home » చిరంజీవి వల్ల అల్లు అర్జున్ డబ్బులు పోగొట్టుకున్నారా? ఎంత పోగొట్టుకున్నారో తెలుసా?

చిరంజీవి వల్ల అల్లు అర్జున్ డబ్బులు పోగొట్టుకున్నారా? ఎంత పోగొట్టుకున్నారో తెలుసా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

మెగాస్టార్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్వయం కృషితో పైకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. మెగాస్టార్ తరువాత ఆ ఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వారు కూడా స్టార్ హీరోలుగా సక్సెస్ అయ్యారు. ఇంకా.. ఆ ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చే అవకాశం ఉండనే ఉంది. అయితే.. మెగాస్టార్ చిరంజీవి కారణంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డబ్బులు నష్టపోయారట. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

allu-arjun-and-chiranjeevi

allu-arjun-and-chiranjeevi

 

మెగాస్టార్ కెrరీర్ లో సూపర్ హిట్ గా నిలిచినా సినిమాల్లో ఇంద్ర ఒకటి. ఈ సినిమా ఇప్పటికి చాలా మందికి ఫేవరెట్ సినిమా కూడా. ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్, ఫైట్లు ఎదో ఒక టైం లో గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో పాపులర్ a సాంగ్ దాయి దాయి దామా.. కులుకే కుందనాల బొమ్మ పాటకు ఎంత మంది ఫాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు. అయితే.. ఈ పాట కారణంగా అల్లు అర్జున్ దాదాపు పాతిక వేల రూపాయలు నష్టపోయారట.

Advertisement

Advertisement

ఈ పాటలో మెగాస్టార్ వేaaసిన వీణ స్టెప్ ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఆ స్టెప్ లో చిరంజీవి గ్రేస్ కు చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఈ డాన్స్ గురించి చర్చ జారుతున్న సమయంలోనే అల్లు అర్జున్ తన స్నేహితుడితో పందెం కట్టారట. ఈ పాటకి మెగాస్టార్ డాన్స్ చేస్తున్న టైం లో చుట్టూ ఎవరూ ఉండరని అల్లు అర్జున్ అన్నారు. కానీ, అల్లు అర్జున్ స్నేహితుడు మాత్రం పక్కన సోనాలి బింద్రే ఉంటుందని చెప్పాడట. ఈ చర్చ బెట్టు కట్టుకునేవరకు వెళ్ళింది. అప్పటికే 17 సార్లు సినిమా చుసిన అల్లు అర్జున్ ఈ బెట్టు కోసం మరోసారి సినిమా చూశారట. సినిమా చూసాక.. తన ఫ్రెండ్ వద్దకు వెళ్లి నువ్వు చెప్పిందే కరెక్ట్.. ఆ పాటలో మెగాస్టార్ గ్రేస్ చూపు తిప్పనివ్వలేదు అని.. అందుకే పక్కన హీరోయిన్ ఉంది అన్న విషయాన్నీ గమనించలేదని చెప్పి, పాతిక వేలు ఇచ్చేశారట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading